Ashada Masam | రేపటి నుంచే ఆషాఢమాసం.. జగన్నాథ రథయాత్ర నుంచి గురుపౌర్ణమి వరకు పర్వదినాలు ఇవే..!
Ashada Masam | హిందూ పంచాంగం ప్రకారం 2026 సంవత్సరానికి సంబంధించిన ఆషాఢ మాసం జూన్ 30న ప్రారంభం కానుంది. ఆగస్టు 12న ముగియనుంది. సనాతన ధర్మంలో ఈ మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. వర్షాకాలం ఆరంభమయ్యే ఈ సమయంలో ప్రకృతిలో కొత్త ఉత్సాహం, సానుకూల శక్తి వ్యాపిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి.
Devotional | Published On Jun 29, 2026, 7.25 pm IST
Ashada Masam | హిందూ పంచాంగం ప్రకారం 2026 సంవత్సరానికి సంబంధించిన ఆషాఢ మాసం జూన్ 30న ప్రారంభం కానుంది. ఆగస్టు 12న ముగియనుంది. సనాతన ధర్మంలో ఈ మాసానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. వర్షాకాలం ఆరంభమయ్యే ఈ సమయంలో ప్రకృతిలో కొత్త ఉత్సాహం, సానుకూల శక్తి వ్యాపిస్తుందని శాస్త్రాలు పేర్కొంటాయి. ముఖ్యంగా భోళా శంకరుడు, శ్రీమహావిష్ణువు, జగన్నాథ స్వామివారి ఆరాధనకు ఈ మాసం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఆషాఢ మాసంలో దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగే జగన్నాథ రథయాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. అలాగే ఈ నెలలో వచ్చే దేవశయని ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆ రోజుతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలలను ఆధ్యాత్మిక సాధన, ధ్యానం, భక్తి, ఆత్మపరిశీలనకు అత్యంత అనుకూలమైన కాలంగా భావిస్తారు. ఆషాఢ మాసంలో అనేక ముఖ్యమైన వ్రతాలు, పర్వదినాలు ఉన్నాయి. భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో వీటిని ఆచరిస్తారు.
ఆషాఢ మాసంలోని ముఖ్యమైన తేదీలు.. పండుగలు, వ్రతాలు
జూన్ 30 : ఆషాఢ మాసం ప్రారంభం
జూలై 3 : కృష్ణపింగళ సంకష్టి చతుర్థి
జూలై 6 : కాలాష్టమి, మాస శ్రీకృష్ణ జన్మాష్టమి
జూలై 10 ఫ యోగిని ఏకాదశి వ్రతం
జూలై 12 : రవి ప్రదోష వ్రతం, మాస శివరాత్రి
జూలై 14 : ఆషాఢ అమావాస్య
జూలై 15 : ఆషాఢ గుప్త నవరాత్రులు ప్రారంభం
జూలై 16 : జగన్నాథ రథయాత్ర, కర్కాటక సంక్రాంతి
జూలై 17 : అనిరుద్ధ చతుర్థి
జూలై 22 : భదాలి నవమి
జూలై 25 : తొలి ఏకాదశి, శయన ఏకాదశి, చాతుర్మాసం ప్రారంభం
జూలై 26 : రవి ప్రదోష వ్రతం
జూలై 28 : కోకిల వ్రతం
జూలై 29 : గురుపౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి
బోనాల జాతర..
హైదరాబాద్‌తో పాటు యావత్ తెలంగాణ వ్యాప్తంగా అత్యంత పవిత్రంగా నిర్వహించే బోనాల పండుగ ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఆషాఢ మాసం తొలి గురువారం లేదంటే ఆదివారంతో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జులై 16న గురువారం రోజున బోనాల సందడి మొదలుకానుంది. అంటువ్యాధులు ప్రబలకుండా రక్షించాలని ఆరోగ్యాన్నివ్వాలని అమ్మవారికి బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.
జగన్నాథ రథయాత్ర
ఆషాఢమాసంలో మాసంలో జరిగే ప్రముఖ ఉత్సవాల్లో పూరీ జగన్నాథుడి రథయాత్ర ఒకటి. సంవత్సరమంతా గర్భగుడిలోనే కొలువై ఉండి.. పూజలందుకునే జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఈ నెలలో భక్తజనం మధ్యకు వస్తాడు. పది రోజుల పాటు పూరీ క్షేత్రంలో ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ నెల 16న జగన్నాథ రథయాత్ర మొదలుకానుంది.
గురుపౌర్ణమి
ఈ ఏడాది పౌర్ణమి తిథి జూలై 28 సాయంత్రం 6.18 గంటలకు ప్రారంభమై జూలై 29 రాత్రి 8.05 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథిని ఆధారంగా తీసుకుంటే జూలై 29న గురుపౌర్ణమి వేడుకలను నిర్వహిస్తారు. ఈ రోజున గురువులను స్మరించి, వారి ఆశీస్సులు పొందడం హిందూ సంప్రదాయంలో విశేషమైన ఆచారంగా కొనసాగుతోంది. వ్యాసమహర్షి జన్మతిథి అయిన ఆషాఢ పౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన కృష్ణ ద్వైపాయనుడే వేద వ్యాసుడయ్యాడు. మహాభారతం, భాగవతం సహా అష్టాదశపురాణాలు అందించాడు. ఆయన అందించిన ఆధ్యాత్మిక సంపద కారణంగా ఆదిగురువుగా పూజలందుకుంటున్నాడు.
యోగిని ఏకాదశి తేదీ
ఆషాఢ మాస కృష్ణపక్ష యోగిని ఏకాదశి తిథి జూలై 9 సాయంత్రం 7:46 గంటలకు ప్రారంభమై జూలై 10 సాయంత్రం 4:52 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జూలై 10, శుక్రవారం యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు.
తొలి ఏకాదశి..
జూలై 25న తొలి ఏకాదశి వస్తుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో నాలుగు నెలలపాటు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణ విశ్వాసం. ఈ రోజుతో చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో విశ్వ నిర్వహణ బాధ్యతలను పరమశివుడు స్వీకరిస్తారని ఆధ్యాత్మిక గ్రంథాలు వివరిస్తాయి. అందువల్ల చాతుర్మాసాన్ని ఉపవాసాలు, జపాలు, ధ్యానం, దానధర్మాలు, భక్తి కార్యక్రమాలకు అత్యంత శుభప్రదమైన సమయంగా భక్తులు భావిస్తారు. అయితే, దేవతలకు పగటి కాలాన్ని ఉత్తరాయణమని, రాత్రి కాలాన్ని దక్షిణాయనంగా పేర్కొంటారు. ఆషాఢంలో వచ్చే ఈ ఏకాదశి రోజే శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే దేవతలకు రాత్రికాలం ప్రారంభమైందని చెప్పేందుకు సూచనగా భావిస్తారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Shabad Current Shock Death | కరెంట్ షాక్‌తో బాలుడు మృతి.. లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమా?
- ●Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు
- ●Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?
- ●Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
- ●TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..
- ●Street Dog | అమానవీయ ఘటన.. కుక్కమెడకు ఇటుక కట్టి.. నదిలోకి తోసేశారు

Shabad Current Shock Death | కరెంట్ షాక్‌తో బాలుడు మృతి.. లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమా?

Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు

Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!



