Harish Rao | నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం.. ఖండించిన హరీశ్‌రావు
Harish Rao | పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు.
Harish Rao | పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వద్ద న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. ఆందోళన చేస్తున్న వారిని ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం సీఎం రేవంత్ రెడ్డి పాలన తీరును ప్రతిబింబిస్తోందన్నారు. నిరుద్యోగులపై జరిగిన పోలీసు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతను అరెస్టు చేయడం నియంతృత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు నిరుద్యోగులను అణచివేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి హిట్లర్ పాలనను తలపిస్తోందని హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారిపై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు. అరెస్టు చేసిన నిరుద్యోగులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, డీజీపీ స్వయంగా ప్రకటించిన 20 వేల పోలీస్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగుల ఆకాంక్షలను అణచివేయడం కాకుండా, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Shabad Current Shock Death | కరెంట్ షాక్‌తో బాలుడు మృతి.. లైన్మెన్ నిర్లక్ష్యమే కారణమా?
జూన్ 29, 2026

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
జూన్ 29, 2026

TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..
జూన్ 29, 2026
తాజావార్తలు
- ●Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు
- ●Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?
- ●Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!
- ●TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..
- ●Street Dog | అమానవీయ ఘటన.. కుక్కమెడకు ఇటుక కట్టి.. నదిలోకి తోసేశారు
- ●Ntr | అఫీషియల్ - ఒకే ఆయుధం...ఒకే లక్ష్యం - ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ ట్రెండింగ్

Mallikarjun Kharge | రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మరోసారి మల్లికార్జున ఖర్గే గుర్తింపు

Anjali | రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన అంజలి - కారణం ఇదేనా?

Diseased Chicken Shadnagar | షాద్‌నగర్ చికెన్ ప్రియులకు బిగ్ అలర్ట్: మీరు తినే బిర్యానీలో కుళ్లిన మాంసం.. అస్సలు టెంప్ట్ అవ్వకండి..!

TGSRTC | యూనియన్ ఎన్నికల దిశగా టీజీఎస్ ఆర్టీసీ కసరత్తు..



