Malayalam OTT | ట్విస్ట్‌లతో వణికించే మలయాళం హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది – ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్
లేటెస్ట్ మలయాళం హారర్ కామెడీ మూవీ కరుక్కమ్ ఓటీటీ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది. శ్రీనాథ్ బాషీ, ఫెమినా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ జూలై సెకండ్ వీక్ నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Jun 29, 2026, 7.13 pm IST
Malayalam OTT | లేటెస్ట్ మలయాళం హారర్ కామెడీ మూవీ కరుక్కమ్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. శ్రీనాథ్ బాషీ, ఫేమినా జార్జ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సుభాష్ లలిత సుబ్రమణియన్ దర్శకత్వం వహించారు. పుష్ప ఫేమ్ సామ్ సీఎస్ మ్యూజిక్ అందించాడు. మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మలయాళం మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఐఎమ్‌డీబీలో 9.1 రేటింగ్‌ను దక్కించుకుంది. నాలుగు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా థియేటర్లలో ఎనిమిది కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నది.
సోనీలివ్...
తాజాగా ఈ మలయాళం హారర్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను సోనీలివ్ దక్కించుకుంది. జూలైలో కరుక్కమ్ ఓటీటీలోకి రానున్నట్లు సోనీలివ్ ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. జూలై 10న ఈ హారర్ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఆత్మల బారిన పడితే...
ఆత్మల బారిన పడిన ఇద్దరు స్నేహితుల కథతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. కాన్సెప్ట్, కామెడీ తో పాటు ట్విస్ట్‌లు బాగున్నాయనే టాక్ వచ్చింది. ధనుష్, ఖాజా ప్రాణ స్నేహితులు. ఓ రోజు తాగిన మత్తులో శ్మశానంలోకి వస్తారు. సమాధులపై ఉన్న శిలువలను తొలగిస్తారు. అప్పటినుంచి ఐదు ఆత్మలు వారిని వెంటాడటం మొదలుపెడతాయి. ఆ ఆత్మల కారణంగా ఇద్దరూ స్నేహితులు ఎలాంటి కష్టాలు పడ్డారు? వాటి గతం ఏమిటి? ఆత్మల నుంచి ఇద్దరికి విముక్తి లభించిందా? లేదా? అన్నదే కరుక్కమ్ మూవీ కథ. ఈ సినిమాలో ప్రవీణ్ టీజే, అభిరామ్ రాధాకృష్ణన్, జీన్ లాల్ పాల్ కీలక పాత్రల్లో కనిపించారు.
మిన్నల్ మురళితో...
మంజుమ్మల్ బాయ్స్‌తో మలయాళంలో ఫేమస్ అయ్యాడు శ్రీనాథ్ భాషీ. ఈ సినిమాలో సుభాష్ అనే క్యారెక్టర్‌లో కనిపించాడు. మరోవైపు మిన్నల్ మురళి మూవీతో మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఫెమినా జార్జ్. మలయాళంలో మూడు సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఏగన్ మూవీతో తెలుగు చిత్రసీమకు పరిచయం కాబోతుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ఏగన్ మూవీలో ఫెమినా జార్జ్‌తో పాటు కోర్ట్ ఫేమ్ శ్రీదేవి మరో నాయికగా కనిపించబోతుంది.
సంబంధిత వార్తలు

Sridevi | కోర్ట్ హీరోయిన్ కొత్త మూవీ – ఉమెన్‌న్ కాలేజీలో యువకుడికి అడ్మిషన్ దొరికితే!
అక్టోబర్ 6, 2026

Malayalam OTT | టాలీవుడ్ హీరోయిన్ మలయాళం థ్రిల్లర్ మూవీ – ఒకే రోజు ఆరు ఓటీటీలలో రిలీజ్
అక్టోబర్ 6, 2026

Samantha | ప్రెగ్నెన్సీతో అర్ధరాత్రి వరకు షూటింగ్.. సమంత డెడికేషన్‌పై నెటిజన్ల ప్రశంసలు
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు
- ●PM Narendra Modi 25 Years | సీఎంగా మొదలై పీఎంగా విశ్వవేదికపైకి.. పాలనాధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రభంజనం: కేంద్ర మంత్రివర్గం చారిత్రక తీర్మానం
- ●Sridevi | కోర్ట్ హీరోయిన్ కొత్త మూవీ - ఉమెన్‌న్ కాలేజీలో యువకుడికి అడ్మిషన్ దొరికితే!
- ●BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్..!
- ●DRDO | ఆత్మనిర్భర్ భారత్‌లో ముందడుగు.. డీఆర్డీవో హై-ఆల్టిట్యూడ్ ప్లాట్‌ఫామ్ సిస్టమ్ సక్సెస్..!
- ●Jason Sanjay | నేను లవ్ ఫెయిల్యూర్నే - బ్రేకప్‌పై దళపతి విజయ్ కొడుకు కామెంట్స్

CM Revanth Reddy Erravalli Review | ఎర్రవల్లిలో 45 ఎకరాల భూమి మాయం.. సీఎం సీరియస్.. కేసీఆర్ కుటుంబానికి నోటీసులు

PM Narendra Modi 25 Years | సీఎంగా మొదలై పీఎంగా విశ్వవేదికపైకి.. పాలనాధినేతగా మోదీ 25 ఏళ్ల ప్రభంజనం: కేంద్ర మంత్రివర్గం చారిత్రక తీర్మానం

Sridevi | కోర్ట్ హీరోయిన్ కొత్త మూవీ - ఉమెన్‌న్ కాలేజీలో యువకుడికి అడ్మిషన్ దొరికితే!

BitChat | బ్లూటూత్ మెసేజింగ్ యాప్ బిట్‌చాట్‌పై కేంద్రం చర్యలు.. ప్లే స్టోర్ నుంచి అవుట్..!



