త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | హైద‌రాబాద్‌లో 29న నీటి స‌ర‌ఫ‌రా బంద్

HMWSSB | కృష్ణా డ్రింకింగ్ వాట‌ర్ పైపులైన్ జంక్ష‌న్ వ‌ర్క్స్ కార‌ణంగా.. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ నెల 29న మంచి నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి ప్ర‌క‌టించింది.

S

Hyderabad | Published On Aug 27, 2026, 8.56 pm IST

HMWSSB | హైద‌రాబాద్‌లో 29న నీటి స‌ర‌ఫ‌రా బంద్
Advertisement

HMWSSB | త్రినేత్ర‌.న్యూస్ : కృష్ణా డ్రింకింగ్ వాట‌ర్ పైపులైన్ జంక్ష‌న్ వ‌ర్క్స్ కార‌ణంగా.. హైద‌రాబాద్ న‌గ‌రంలో ఈ నెల 29న మంచి నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు జ‌ల‌మండ‌లి ప్ర‌క‌టించింది. శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల నుంచి 30న ఉద‌యం 10 గంట‌ల వ‌ర‌కు తాగునీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌భావిత ప్రాంతాల ప్ర‌జ‌లు మంచి నీటిని పొదుపుగా వాడుకోవాల‌ని జ‌ల‌మండ‌లి సూచించింది.

ప్ర‌భావిత‌మ‌య్యే ప్రాంతాలివే..

శాస్త్రిపురం, బండ్ల‌గూడ‌, శంషాబాద్, మ‌దుబ‌న్, దుర్గా న‌గ‌ర్, సులేమాన్ న‌గ‌ర్, పీడీపీ, గోల్డెన్ హైట్స్, అత్తాపూర్, కిస్మ‌త్‌పూర్, 9 నంబ‌ర్, ఆళ్ల‌బండ‌, భోజ‌గుట్ట‌, గంధ‌గూడ‌, ప్ర‌స‌న్న న‌గ‌ర్, జూబ్లీహిల్స్, త‌త్తిఖానా, గ‌చ్చిబౌలి, మాదాపూర్, షేక్‌పేట ఏరియాల్లో నీటి స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌నుంది.

Advertisement
Advertisement