త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | రాఖీ పండుగ‌కు 5,000 ఆర్టీసీ బ‌స్సులు..

TGSRTC | రాఖీ పండుగ సంద‌ర్భంగా టీజీఎస్ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని 5 వేల ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు.

S

Telangana | Published On Aug 27, 2026, 9.22 pm IST

TGSRTC | రాఖీ పండుగ‌కు 5,000 ఆర్టీసీ బ‌స్సులు..
Advertisement

TGSRTC | త్రినేత్ర‌.న్యూస్ : రాఖీ పండుగ సంద‌ర్భంగా టీజీఎస్ఆర్టీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని 5 వేల ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ వెల్ల‌డించారు. ఈ ప్ర‌త్యేక బ‌స్సులు ఆగ‌స్టు 31వ తేదీ వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు.

ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి, ఆగస్టు 30న ఆదివారం సెలవు కావ‌డంతో ప్ర‌యాణికుల ర‌ద్దీ అధికంగా ఉండే అవ‌కాశం ఉంద‌న్నారు. తిరుగు ప్ర‌యాణాలు 31వ తేదీ వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌యాణికుల ర‌ద్దీకి అనుగుణంగా బ‌స్సుల‌ను న‌డుపుతామ‌న్నారు.

గ‌తేడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులను నడిపించగా, ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 240 బస్సులను అదనంగా పెంచి మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Advertisement
Advertisement