TGIIC | ఘనంగా ప్రారంభమైన టీజీఐఐసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్
TGIIC | తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబురాలకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
TGIIC | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ క్రీడా సంబురాలకు టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ.. నిరంతరం విధుల్లో బిజీగా ఉండే ఉద్యోగులకు ఈ క్రీడలు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయని చెప్పారు. క్రీడల ప్రధాన ఉద్దేశం కేవలం గెలవడం మాత్రమే కాదని, అందరూ కలిసికట్టుగా పాల్గొనడమే అసలైన విజయమని పేర్కొన్నారు. ఉద్యోగుల మధ్య ఐక్యత పెంచడానికి, స్నేహభావం చాటడానికి ఆరోగ్యకరమైన పోటీతత్వం పెంపొందించడానికి ఈ పోటీలు తోడ్పడతాయని వివరించారు.

క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో ఆడాలని సూచించారు. ఈ క్రీడా వేడుకల్లో భాగంగా సంస్థకు చెందిన పురుష, మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో స్టేడియంలో సందడి వాతావరణం నెలకొంది. రెండు రోజుల పాటు సాగే ఈ మీట్‌లో అథ్లెటిక్స్, క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, లెమన్ స్పూన్, స్విమ్మింగ్ వంటి పలు రకాల పోటీలలో పాటు చెస్, క్యారమ్స్ వంటి ఇండోర్ గేమ్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు
- ●Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..
- ●Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!
- ●CM Revanth Reddy | 17న రూ. 1300 కోట్ల హ్యామ్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన
- ●TMC-Congress | కాంగ్రెస్లో టీఎంసీ విలీనం..? మమతా బెనర్జీకి కీలక ప్రతిపాదన చేసిన సోనియా గాంధీ
- ●Meta And Reliance | మెటా-రిలయన్స్ భారీ ఏఐ డీల్.. జామ్నగర్లో 168 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు..

Singareni | సింగరేణికి కేంద్రం ప్రశంస.. రూ. 40 కోట్లు వడ్డీతో సహా చెల్లింపు

Canva | ఇక ఇంటర్నెట్ లేకున్నా కాన్వా పనిచేస్తుంది.. ఎక్కడైనా డిజైన్లు చేసుకోవచ్చు..

Heavy Rains | సాయంత్రం 6.30 తర్వాత హైదరాబాద్లో భారీ వర్షం..!

CM Revanth Reddy | 17న రూ. 1300 కోట్ల హ్యామ్ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన






