త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడ‌త‌లో కౌన్సెలింగ్‌

TGEAPCET | రాష్ట్రంలోని బీ ఫార్మ‌సీ, ఫార్మ్‌ డీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం ఉన్నత విద్యా మండలి (TGCHE) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. ఎంపీసీ స్ట్రీమ్ అభ్య‌ర్థ‌ల‌కు TGEAPCET ద్వారా బీ.ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సులలో ప్రవేశాలు క‌ల్పించ‌నుంది.

G

Telangana | Published On Aug 27, 2026, 9.13 am IST

TGEAPCET | బీ ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సుల్లో ప్రవేశాలు.. ఒకే విడ‌త‌లో కౌన్సెలింగ్‌
Advertisement

TGEAPCET | త్రినేత్ర‌.న్యూస్‌: రాష్ట్రంలోని బీ ఫార్మ‌సీ, ఫార్మ్‌ డీ కాలేజీల్లో ప్ర‌వేశాల కోసం ఉన్నత విద్యా మండలి (TGCHE) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్ర‌క‌టించింది. ఎంపీసీ స్ట్రీమ్ అభ్య‌ర్థ‌ల‌కు TGEAPCET ద్వారా బీ.ఫార్మసీ, ఫార్మ్ డీ కోర్సులలో ప్రవేశాలు క‌ల్పించ‌నుంది. కౌన్సెలింగ్‌ను ఒకే ద‌శ‌లో పూర్తిచేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో అభ్యర్థులు సెప్టెంబరు 3, 4 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 4వ తేదీన తమ ఆప్షన్లను తప్పనిసరిగా ఫ్రీజ్ చేయాలి. 6వ తేదీ లోపు సీట్ల కేటాయింపు పూర్తికానుంది. ఎంపికైన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్-రిపోర్టింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత సెప్టెంబర్ 8వ తేదీలోగా కేటాయించిన కళాశాలలో రిపోర్ట్ చేయాలి.

కౌన్సెలింగ్ ఒకే దశలో నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ ఆప్షన్లను జాగ్రత్తగా ఎంచుకోవాలని అధికారులు సూచించారు. కాగా, టీజీఈఏపీసెట్ ప్రవేశాల ద్వారా ఇప్పటికే ఇంజనీరింగ్ బ్రాంచ్‌లలో చేరిన అభ్యర్థులు ఆప్షన్లను ఎంచుకోవడానికి అర్హులు కార‌ని స్ప‌ష్టం చేసింది. ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 5 వరకు జరిగిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement