త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ‌లో మ‌రో నాలుగైదు రోజులు వాన‌లే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!

TG Weather | తెలంగాణ‌లో రాగ‌ల నాలుగైదు రోజులు వ‌ర్షాలు కొన‌సాగుతాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

P

Telangana | Published On Mar 25, 2026, 6.45 pm IST

TG Weather | తెలంగాణ‌లో మ‌రో నాలుగైదు రోజులు వాన‌లే.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
Advertisement

TG Weather | తెలంగాణ‌లో రాగ‌ల నాలుగైదు రోజులు వ‌ర్షాలు కొన‌సాగుతాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. బుధ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కొన‌సాగుతాయ‌ని తెలిపింది.

గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, వికారాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే ఛాన్స్ ఉంద‌ని తెలిపింది. శుక్ర‌వారం భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌నుమ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల్లో ఈదురుగాలుల‌తో కూడిన వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలున్నాయ‌ని చెప్పింది.

శ‌నివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, సిద్దిపేట‌, భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి, విక‌రాబాద్‌, సంగారెడ్డి, మెద‌క్, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, నాగ‌ర్ క‌ర్నూల్‌, వ‌న‌ప‌ర్తి, నారాయ‌ణ‌పేట‌, జోగులాంబ గ‌ద్వాల జిల్లాల‌కు వ‌ర్షాలు కురుస్తాయ‌ని అంచ‌నా వేసింది. ఆదివారం నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, రంగారెడ్డి, మెద‌క్‌, కామారెడ్డి, మ‌హ‌బూబ్‌ణ‌గ‌ర్‌, నారాయ‌ణ‌పేట జిల్లాల్లో అక్క‌డ‌క్క వ‌ర్షాలు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని వివ‌రించింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా.. గ‌డిచిన 24 గంట‌ల్లో హైద‌రాబాద్‌, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌, రాజ‌న్న సిరిసిల్ల స‌హా ప‌లుచోట్ల తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాపాతం న‌మోదైంద‌ని టీజీడీపీఎస్ వివ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement