త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG Weather | తెలంగాణ ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ

TG Weather | తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వాన‌లు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపింది.

P

Telangana | Published On Mar 18, 2026, 7.53 pm IST

TG Weather | తెలంగాణ ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Advertisement

TG Weather | తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వ‌డ‌గ‌ళ్ల వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. రాబోయే ఐదురోజుల పాటు రాష్ట్రంలో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వాన‌లు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని తెలిపింది. రాబోయే మూడురోజుల్లో గ‌రిష్ట ఉష్ణోగ్ర‌త‌లు రెండు నుంచి నాలుగు డిగ్రీల మేర క్ర‌మంగా త‌గ్గుతాయ‌ని పేర్కొంది. బుధ‌వారం జ‌న‌గాం, సిద్దిపేట‌, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల‌తో అక్క‌డ‌క్క‌డ వ‌డ‌గ‌ళ్ల వాన‌లు ప‌డే ఛాన్స్ ఉంద‌ని చెప్పింది. ఈ మేర‌కు ఆయా జిల్లాల‌కు వాతావ‌ర‌ణ‌శాఖ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.

గురువారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్‌, పెద్ద‌ప‌ల్లి, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్‌, హ‌న్మ‌కొండ‌, జ‌న‌గాం, సిద్దిపేట‌, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, హైద‌రాబాద్‌, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వివ‌రించింది. శుక్ర‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల‌, నిర్మ‌ల్‌, నిజామాబాద్‌, జ‌గిత్యాల‌, రాజ‌న్న సిరిసిల్ల‌, పెద్ద‌ప‌ల్లి, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి, ములుగు, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట‌, మ‌హ‌బూబాబాద్‌, వ‌రంగ‌ల్ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వాన‌లు ప‌డే సూచ‌న‌లున్నాయ‌ని వివ‌రించింది. శ‌నివారం ములుగు, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, న‌ల్గొండ‌, సూర్యాపేట జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వివ‌రించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement