TG Weather | తెలంగాణను వణికిస్తున్న చలి.. మరింత తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!
TG Weather | తెలంగాణను చలి వణికిస్తున్నది. చలికి తోడు దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది. రాత్రి నుంచి ఉదయం వరకు చలి తీవ్రత ఉండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ జారీ చేసింది.
TG Weather | తెలంగాణను చలి వణికిస్తున్నది. చలికి తోడు దట్టంగా పొగమంచు కమ్మేస్తున్నది. రాత్రి నుంచి ఉదయం వరకు చలి తీవ్రత ఉండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ జారీ చేసింది. రాగల మూడురోజులు చలి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండురోజుల్లో రాష్ట్రంలో అక్కడక్క కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ పొగ మంచు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పొగమంచు ఉంటుందని పేర్కొంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. సోమవారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా 16 డిగ్రీలకు పడిపోయాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లా బేలాలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీజీడీపీఎస్ వివరించింది.
ఇదిలా ఉండగా.. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని హిందూ మహాసముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని.. అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం పేర్కొంది. రాబోయే 24గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పింది. రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే ఛాన్స్ ఉందని చెప్పింది.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



