TG Budget 2026 | సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.22,615కోట్లు
TG Budget 2026 | తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.22,615 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. డిసెంబర్ 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ ప్రాధాన్యతల్లో ఒకటని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం గౌరవ సుప్రీంకోర్టు, ట్రిబ్యునల్, చట్టబద్ధమైన సంస్థలు, భారత ప్రభుత్వం, ప్రతి వేదికపై తమ ప్రభుత్వం సమర్థవంతంగా పోరాడిందన్నారు. ప్రభుత్వానికి గతంలో పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులు వారసత్వంగా వచ్చాయన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చూసేందుకు..
కాబట్టి ప్రస్తుతం కొనసాగుతున్న, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకం, మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, ఎలిమినేటి మాధవ రెడ్డి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) ప్రాజెక్టు, ఉదయసముద్రం, డిండి ఎత్తిపోతల పథకం, మహాత్మా గాంధీ ఎంబీసీ ఎత్తిపోతల పథకం, జాన్‌పాడ్ ఎత్తిపోతల పథకం, మోతె ఎత్తిపోతల పథకం, జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, గౌరవెల్లి ప్రాజెక్టు, ఎర్రుపాలెం జవహర్లాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కుమరం భీం వాగు, చిక్మాను వాగు, కెరామేరి మండలంలోని అమ్మవారి మడగాస్కర్, లెండిగూడ-జైనూర్ (మంటో), రోసీ మాల్టా మినీ రిజర్వాయర్ మరియు ఇతర ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు.
గత ప్రభుత్వం తప్పిదాన్ని సరిదిద్ది..
గత ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదాన్ని తమ ప్రభుత్వం సరిదిద్ది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కూడా చేపడుతుందన్నారు. గతంలో పనులు ప్రభుత్వం సకాలంలో పూడిక చేపట్టకపోవడంతో అనేక ప్రాజెక్టులలో పూడిక (సెడిమెంటేషన్) పేరుకుపోయి రిజర్వాయర్లలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ 'జాతీయ పూడికతీత మార్గదర్శకాల' ప్రకారం.. ఇప్పటికే 'ఆదాయ ఉత్పత్తి విధానం' చేపట్టిన కడెం, లోయర్ మానేరు డ్యామ్ మరియు మిడ్ మానేరు డ్యామ్ ప్రాజెక్టులతో పాటుగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, మూసీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో కోల్పోయిన నీటి నిల్వ సామర్థ్యాన్ని పునరుద్ధరించడానికి పూడికతీత పనులను చేపడుతున్నామని వివరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






