త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TG BIE | ఇంట‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్.. బోర్డు కీల‌క సూచ‌న‌లు..!

TG BIE | రాష్ట్రంలో ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం వార్షిక ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీల‌క సూచ‌న చేసింది. ప‌రీక్షా హాల్‌లోకి అనుమ‌తించేందుకు 5 నిమిషాలు గ్రేస్ పీరియ‌డ్‌గా నిర్ణ‌యించిన‌ట్లు బోర్డు వెల్ల‌డించింది.

S

Telangana | Published On Jan 20, 2026, 2.45 pm IST

TG BIE | ఇంట‌ర్ విద్యార్థుల‌కు అల‌ర్ట్.. బోర్డు కీల‌క సూచ‌న‌లు..!
Advertisement

TG BIE | త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్రంలో ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం వార్షిక ప‌రీక్ష‌లు వ‌చ్చే నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కీల‌క సూచ‌న చేసింది. ప‌రీక్షా హాల్‌లోకి అనుమ‌తించేందుకు 5 నిమిషాలు గ్రేస్ పీరియ‌డ్‌గా నిర్ణ‌యించిన‌ట్లు బోర్డు వెల్ల‌డించింది. ఈ నిబంధ‌న‌ను గ‌తేడాది కూడా అమ‌లు చేశారు. ఈ ఏడాది కూడా అమ‌లు చేయాల‌ని ఇంట‌ర్ బోర్డు పేర్కొంది.

ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. 9.05 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్షా హాల్లోకి అనుమ‌తించ‌నున్నారు. ముందు జాగ్ర‌త్త‌గా ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద‌కు ఉద‌యం 8.45 గంట‌ల వ‌ర‌కే చేరుకోవాల‌ని బోర్డు అధికారులు సూచించారు.

ఫిబ్ర‌వ‌రి 25 నుంచి మార్చి 18 వ‌ర‌కు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. 2025-26 విద్యాసంవ‌త్స‌రానికి ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రంలో మొత్తం 10,47,815 మంది విద్యార్థులు ప్ర‌వేశం పొందారు. ఇందులో 9.96 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యేందుకు ఫీజు చెల్లించారు. మొత్తం 1495 ప‌రీక్షా కేంద్రాల‌ను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement