Tesla | హైదరాబాద్ వైపు టెస్లా అడుగులు.. రెండు నెలల్లో సేల్స్ షురూ..
Tesla | అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా (Tesla) హైదరాబాద్ (Hyderabad) వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. షోరూం ఏర్పాట్లలో ఉన్న కంపెనీ, మరో రెండు నెలల్లో తమ కార్లను భాగ్యనగర రోడ్లపై పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నది.
Tesla | త్రినేత్ర.న్యూస్: అమెరికాకు చెందిన విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా (Tesla) హైదరాబాద్ (Hyderabad) వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. షోరూం ఏర్పాట్లలో ఉన్న కంపెనీ, మరో రెండు నెలల్లో తమ కార్లను భాగ్యనగర రోడ్లపై పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే ముంబై, న్యూఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరులో ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లను తెరిచిన టెస్లా.. హైదరాబాద్ కొండపూర్‌లో షోరూం, సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నది. రెండు నెలల్లో సేల్స్ కూడా ప్రారంభించనుంది. దీంతో తెలంగాణ ప్రంపచ స్థాయి సాంకేతిక, ఆవిష్కరణల కేంద్రంగా ఆవిర్భవిస్తున్న ప్రస్తుత తరుణంలో హైదరాబాద్‌కు టెస్లా రాక ఒక ప్రతిష్ఠాత్మక ఘంగా నిలువనుంది.
టెస్లా బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జీఎం శరద్ అగర్వాల్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మంత్రి శ్రీధర్‌బాబును (Minister Sridhar Babu) శుక్రవారం కలిశారు. హైదరాబాద్‌లో షోరూం ఏర్పాటు చేస్తున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ప్రస్తు తం కార్ల మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా సుమారు 4 శాతం మాత్రమే ఉందని, ఈ రంగంలో భారీ అవకాశాలు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులకు మంత్రి వివరించారు.

ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, హైదరాబాద్‌ను క్లీన్ టెక్నాలజీ, ఆధునిక మొబిలిటీకి ప్రపంచస్థాయి కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో ఉందని చెప్పారు. రాష్ట్రంలో టెస్లా అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. పరిశ్రమలు, సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కాగా, భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా మోడల్–వై కారును ఇప్పటికే ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆటోపైలెట్, ఫుల్ సెల్ఫ్–డ్రైవింగ్ వంటి అత్యాధునిక సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లు కంపెనీ కార్ల ప్రత్యేకత.
సంబంధిత వార్తలు

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
నవంబర్ 28, 2026

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
నవంబర్ 28, 2026

High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు
నవంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



