BRSLP | తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం
BRSLP | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ (Assembly) సమావేశాల నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల (Maze Farmers)కు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కజొన్న కంకులతో గన్ పార్క్ (Gun Park) వద్ద నిరసన తెలిపారు. అనంతరం అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు వెళ్తుండగా ప్రవేశద్వారం వద్దనే మార్షల్స్ అడ్డుకున్నారు.
మొక్కజొన్న రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన
BRSLP | త్రినేత్ర.న్యూస్ : అసెంబ్లీ (Assembly) సమావేశాల నేపథ్యంలో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో మొక్కజొన్న రైతుల (Maze Farmers)కు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మొక్కజొన్న కంకులతో గన్ పార్క్ (Gun Park) వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని, తక్షణమే మొక్కజొన్నకు మద్దతు ధర చెల్లించాలని నినదించారు. అనంతరం అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు వెళ్తుండగా ప్రవేశద్వారం వద్దనే మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేల చేతిలోని కంకులను లాక్కున్నారు. దాంతో మక్కలన్నీ కిందపడిపోయాయి. ఈ క్రమంలో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. మార్షల్స్‌కు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనాయకుడు హరీశ్‌రావు చేతికి స్వల్పగాయమైంది. ఆగ్రహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మార్షల్స్‌కి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో రూ.1600, రూ.1700 ధరకే మొక్క జొన్న అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని వాపోయారు. మరో వైపు అకాల వర్షాల వల్ల పంట నష్టపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఎందుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని ప్రశ్నించారు. రెండు రోజులుగా పడుతున్న వడగళ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!
- ●Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..
- ●Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ
- ●Bars Shutdown | మద్యం ప్రియులకు అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు బంద్
- ●TTD | అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచారం.. భక్తులు అప్రమత్తంగా ఉండాలన్న టీటీడీ

Janhvi Kapoor | ఆమె శరీరం...ఆమె నిర్ణయం...డీప్‌ఫేక్ వీడియోలపై జాన్వీకపూర్ రియాక్షన్ - తెలుగు డైరెక్టర్లపై సెటైర్స్!

Kavitha | సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా వెంటనే ప్రకటించాలి: కవిత

Stock Markets | స్టాక్ మార్కెట్లకు జోష్.. సెన్సెక్స్ 490 పాయింట్లు జంప్..

Hostel Welfare Officer | హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్.. 9 నుంచి దరఖాస్తులు షురూ






