KTR | బీఆర్ఎస్ కన్నేపల్లి పంప్‌హౌస్ సందర్శన.. కేటీఆర్ బృందాన్ని జనగామ వద్ద అడ్డుకున్న పోలీసులు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) సందర్శనకు బయలుదేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్‌ను (Kannepally Pump House) పరిశీలించనున్నారు.
KTR | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలోని పార్టీ ప్రతినిధుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) సందర్శనకు బయలుదేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నేపల్లి (లక్ష్మీ) పంప్‌హౌస్‌ను (Kannepally Pump House) పరిశీలించనున్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన సీనియర్ నేతలు ఇందులో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌వీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేస్తున్నారు. జనగామ జిల్లా పెంబర్తి వద్ద హైవే మీద బారికేడ్లు పెట్టి కేటీఆర్ కాన్వాయ్‌ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ (Congress) పోలీసులను పెట్టి ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటామన్నారు. కన్నేపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నదని చెప్పారు. కాళేశ్వరం జలాలను రైతులకు చూపెడుతామని స్పష్టంచేశారు. నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ (Revanth Reddy) దుర్మార్గపు వైఖరిని ఎండగడతామని వెల్లడించారు. కన్నెపల్లి వద్ద మోటర్లు ఆన్ చేస్తే మేడిగడ్డ బరాజ్‌తో (Medigadda Barrage) సంబంధం లేకుండా మొత్తం తెలంగాణను సస్యామలం చేసేలా కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేశారు. 93.5 ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు. కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్లు చాల్ చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వొచ్చు. రైతులు నాట్లు ఏసుకోచ్చు.

ఈ నీళ్లు చూపెట్టడానికి పోతుంటే పోలీసులు మమ్మల్ని జనగామలోనే (Jangaon) అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకని అడుగుతున్నా?. కింద లక్ష క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి.. నీళ్లు ఇస్తే యూరియా ఇవ్వాలి. పంట కొనాలి. మద్దతు ధర ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి. ఈ బాధంతా నాకెందుకు. రైతులను ఎండబెట్టాలి. రైతుల పొలాలకు నీళ్లు రాకుండా చేయాలి. నీళ్లుఇచ్చే సౌలత్ ఉన్నా దానిని పండబెట్టిన ముఖ్యమంత్రి వైఖరి, ప్రభుత్వ రైతు వ్యతిరేఖ వైఖరిని చూపెట్టడానికి బయల్దేరాం. దమ్ముంటే, చేతనైతే మంచిపనులు చేసి ప్రజల ముందుకు రావాలి. వరంగల్‌లో తమ యాత్రను ఆపాలని చూస్తే.. పోలీసులపై మర్లబడైనా ఇక్కడి నుంచి కన్నెపల్లికి పోతమని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి అనే సన్నాసి సూచనలతోనే పోలీసులు తమను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ సర్కార్ పోలీసులను పెట్టి ఎంత అడ్డుకునే ప్రయత్నం చేసినా తప్పకుండా కన్నెపల్లి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటాం..
వృథాగా పోతున్న లక్ష క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను రైతులకు చూపెడుతాం..
నీళ్లను ఎత్తిపోయకుండా రైతుల పొలాలను ఎండబెట్టే కుట్ర చేస్తున్న రేవంత్ సర్కార్ దుర్మార్గపు… pic.twitter.com/OOV0W8FEo9
— BRS Party (@BRSparty) July 5, 2026
తాజావార్తలు
- ●Ponnam Prabhakar | మట్టి కుండలోనే బోనం చేద్దాం.. చేతివృత్తులను ప్రోత్సహిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మహిళా వ్యతిరేక సర్కార్
- ●Drunk and Drive | సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు
- ●Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో
- ●Hyderabad | కూతురికి మాటలు రావట్లేదని.. 12వ అంతస్తు పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
- ●Drinking Water | నేడు, రేపు ఈ ప్రాంతాల్లో మంచి నీళ్లు బంద్..

Ponnam Prabhakar | మట్టి కుండలోనే బోనం చేద్దాం.. చేతివృత్తులను ప్రోత్సహిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Alka Lamba | బీజేపీది.. చందా చోర్ సర్కార్.. మహిళా వ్యతిరేక సర్కార్

Drunk and Drive | సైబరాబాద్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్.. 190 మందిపై కేసులు

Vande Bharat Express | భారీ వర్షాలకు నీట మునిగిన పట్టాలు.. దూసుకెళ్లిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. వీడియో






