Heat Wave | నేడు ఈ జిల్లాల్లో వడగాల్పులు.. ఎల్లో అలర్ట్ జారీ
Heat Wave | రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి (Heat Wave). ఉదయం 8 గంటలకే సూర్యూడు మండిపోతున్నాడు. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతన్నాయి.
Heat Wave | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి (Heat Wave). ఉదయం 8 గంటలకే సూర్యూడు మండిపోతున్నాడు. దీంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగా నమోదవుతన్నాయి. రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో వడ గాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహాబూబ్ నగర్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా శుక్రవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌తో పాటు నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో మధ్యాహ్నం సమయంలో ప్రజలు అవసరమైతేనే బయటకు వెళ్లాలని అధికారులు సూచించారు. గొడుగు, టోపీ, తెల్లని రుమాలు ధరించాలన్నారు. తెల్లని నూలు వస్త్రాలు ధరించడం ఉత్తమమని, కూల్ డ్రింక్స్, మత్తు పానీయాల జోలికి వెళ్లకూడదన్నారు. నీరు, ఇతర ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలని తెలిపారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



