Governor | రాష్ట్రానికి నూతన గవర్నర్.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్ వర్మ బదిలీ
Governor | రాష్ట్ర గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) గవర్నర్‌గా పనిచేస్తున్నారు.
Governor | త్రినేత్ర.న్యూస్: రాష్ట్ర గవర్నర్ (Governor) జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు. దీంతో ఆయన స్థానంలో తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్‌ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన హిమాచల్‌ప్రదేశ్ (Himachal Pradesh) గవర్నర్‌గా పనిచేస్తున్నారు. కాగా, పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ (Ananda Bose) ఆకస్మిక రాజీనామాతో కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇందులో భాగంగా తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్‌ను మహారాష్ట్రకు పంపించారు.
ఆయన 2024, జూలై 31న రాష్ట్రానికి నాలుగో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. 20 నెలలపాటు తెలంగాణకు (Telangana) సేవలు అందించారు. కవి, రచయిత అయిన జిష్ణుదేవ్ సాహిత్య కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు తెలుగులోనూ మాట్లాడేవారు. ఆయన పదవీకాలంలో అత్యంత కీలకమైన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. గతేడాది మార్చి 12న బడ్జెట్ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, గ్రామపంచాయతీల విలీన బిల్లులు, జీహెచ్‌ఎంసీ విభజన ఆర్డినెన్సుకు ఆమోదం తెలిపారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న యూనివర్సిటీలకు వీసీల నియామకం జిష్ణుదేవ్‌వర్మ హయాంలోనే పూర్తయింది.
సుదీర్ఘ రాజకీయ అనుభవం..
తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన శివ్‌ప్రతాప్ శుక్లాకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. 1952 ఏప్రిల్ 1న ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్ జిల్లా రుద్రాపుర్‌లో జన్మించిన ఆయన.. రుద్రాపుర్‌లో పాఠశాల విద్య, గోరఖ్‌పుర్‌లో కాలేజీ విద్య పూర్తిచేశారు. న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. బీజేపీ విద్యార్థి విభాగం- ఏబీవీపీ సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. 1983లో బీజేపీలో చేరారు. అయితే ఆయన తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించింది మాత్రం జనతాపార్టీ నుంచి. 1989లో జరిగిన ఎన్నికల్లో గోరఖ్‌పుర్ నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 1991లో ఎమ్మెల్యేగా మరోసారి విజయసాధించి కల్యాణ్‌సింగ్ నేతృత్వంలో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ సహాయమంత్రిగా స్వతంత్ర హోదాలో పనిచేశారు. ఆ తర్వాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొందారు. 2016 జూన్ 10న ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2017 సెప్టెంబర్ 3న మోదీ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2022 జులై 5వరకూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2023 ఫిబ్రవరి 18న హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇప్పుడు తెలంగాణకు బదిలీపై రానున్నారు.
బెంగాల్ గవర్నర్ రాజీనామాకు ఆమోదం
మరో ఏడాదిపాటు పదవీకాలం ఉన్నప్పటికీ పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆయన రాజీనామాకు కేంద్రం ఆమోదం తెలిపింది. మరోవైపు తెలంగాణ సహా 9 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు/ లెఫ్టినెంట్ గవర్నర్లలో అయిదుగురిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేసింది. ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించడంతోపాటు ముగ్గుర్ని కొత్తగా నియమించింది.
9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..
- పశ్చిమ బెంగాల్- ఆర్‌ఎన్.రవి
- హిమాచల్‌ప్రదేశ్- కవిందర్ గుప్తా
- లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్- వినయ్‌కుమార్ సక్సేనా
- తమిళనాడు- కేరళ గవర్నర్ రాజేంద్రవిశ్వనాథ్ అర్లేకర్‌కు అదనపు బాధ్యతలు
- నాగాలాండ్ గవర్నర్- నందకిశోర్ యాదవ్
- బీహార్ గవర్నర్- సయ్యెద్ అటా హస్నైన్
- ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్- తరణ్‌జిత్‌సింగ్ సంధు
ఇవి కూడా చదవండి..
మార్చి 6 రాశిఫలాలు.. ఈ రాశివారి సేవలకు మంచి ప్రతిఫలం లభిస్తుంది!
మోడ్రన్ వార్‌ఫేర్‌లో సరికొత్త అస్త్రం.. ఖమేనీని హతమార్చడంలో 'క్లాడ్ ఏఐ (Claude AI)' కీలక పాత్ర
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
- ●Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు
- ●India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు
- ●Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
- ●Konda Surekha | రేవంత్‌లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ
- ●SUV On Rooftop | చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని

Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్

Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు

India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు

Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు






