T20 World Cup | టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు భారత్
T20 World Cup | టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీంఇండియా విజయం సాధించి, ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ నెల 8న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. వాంఖడేలోని ఈ ఫ్లాట్ పిచ్‌పై పరుగుల వరద పారింది. చివరి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.
రాణించిన సంజూ శాంసన్
254 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీం ఇండియా
చివరివరకూ పోటీలోనే ఇంగ్లాండ్
జాకబ్ బెతెల్ సెంచరీ వృథా
ఏడు పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్
8న న్యూజిలాండ్‌తో ఫైనల్ పోరుకు ఇండియా
T20 World Cup | త్రినేత్ర.న్యూస్: టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై టీంఇండియా విజయం సాధించి, ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఈ నెల 8న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. వాంఖడేలోని ఈ ఫ్లాట్ పిచ్‌పై పరుగుల వరద పారింది. చివరి వరకు విజయం దోబూచులాడిన ఈ మ్యాచ్‌లో టీం ఇండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ తరపున ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 89, 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) విలువైన ఇన్నింగ్స్ ఆడగా, పలువురు భారత బ్యాటర్లు అతడికి అండగా నిలవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105, 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ వృథా అయింది. క్రీజులో ఉన్నంత సేపు విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ కావాల్సిన రన్‌రేట్ మరీ ఎక్కువ కాకుండా జాగ్రత్త పడడంతో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది.
రాణించిన భారత బ్యాటర్లు

వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్ సంజూ శాంసన్ మరోసారి తన విలువను చాటి చెప్పాడు. శివం దూబే (25 బంతుల్లో 43, ఒక ఫోర్, 4 సిక్స్‌లు), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, చివర్లో హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27, 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (7 బంతుల్లో 21, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. శాంసన్ కొద్దిలో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ విలువైన పరుగులు చేశాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (7 బంతుల్లో 9) మరోసారి నిరాశపరిచాడు. ఆ సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన ఇషాన్‌తో కలిసి సంజూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇంగ్లండ్ బౌలర్లలో విల్ జాక్స్, అదిల్ రషీద్ రెండు వికెట్లు, ఆర్చర్ ఒక వికెట్ చొప్పున తీశారు.
భయపెట్టిన జాకబ్ బెతెల్

254 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మొదట్లో తడబడినప్పటికీ, రన్‌రేట్‌ను తగ్గకుండా జాగ్రత్తపడుతూ బ్యాటింగ్ చేసింది. రెండో ఓవర్ మొదటి బంతికే 13 పరుగుల స్కోరు వద్ద ఓపెనర్ ఫిల్ సాల్ట్ వికెట్‌ను హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో కోల్పోయింది. ఆ సమయంలో రన్‌రేట్ కొంత మందగించింది. అయిదో ఓవర్ వేసేందుకు వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా తన మొదటి బంతికే వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ హ్యారీ బ్రూక్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. 17 బంతుల్లో 25 పరుగులు చేసి, టచ్‌లోకి వచ్చినట్లు కనిపిస్తున్న జోస్ బట్లర్‌ను వరుణ్ చక్రవర్తి క్లీన్ బౌల్డ్ చేశాడు. అయిదు బంతుల్లో 17 పరుగులు చేసిన బాంటన్‌ను అక్షర్ పటేల్ పెవిలియన్‌కు చేర్చాడు. అప్పటికి ఇంగ్లండ్ స్కోర్ నాలుగు వికెట్లకు 95 పరుగులు. ఆ తరువాత క్రీజ్‌లోకి వచ్చిన విల్ జాక్స్‌తో కలిసి జాకబ్ బెతెల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. స్కోరు 172 పరుగుల వద్ద విల్ జాక్స్ అవుటైనప్పటికీ, సామ్ కరన్‌తో కలిసి లక్ష్యం దిశగా జట్టును బెతెల్ నడిపించారు. సామ్ కరన్ అవుటైనప్పటికీ చివరి వరకు బెతెల్ భారత్‌ను భయపెట్టాడు. చివరి ఓవర్లో ఆరు బంతులకు 30 పరుగులు చేయాల్సిన దశలో మొదటి బంతికే బెతెల్ రనౌట్ అవడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. భారత బౌలర్లలో పాండ్యా రెండు, అర్ష్‌దీప్‌సింగ్, బుమ్రా, వరున్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్లు తీశారు.
సంబంధిత వార్తలు

Team India | అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. మళ్లీ జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్
సెప్టెంబర్ 1, 2026

Mohan Bhagwat | ముస్లింలు లేకుండా హిందూ రాజ్యం అనే భావనే లేదు: భాగవత్
ఆగస్టు 30, 2026

PM Modi | మీ ప్రతి కన్నీటి చుక్కా బంగారు పతకంతో సమానం.. కామన్వెల్త్ పతక విజేతలను అభినందించిన ప్రధాని మోదీ
ఆగస్టు 10, 2026
తాజావార్తలు
- ●Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
- ●Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు
- ●India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు
- ●Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు
- ●Konda Surekha | రేవంత్‌లో టీడీపీ రక్తం.. బ్లాక్ మెయిల్ చేసి బర్తరఫ్ చేశారు : కొండా సురేఖ
- ●SUV On Rooftop | చోరీ భయం.. కారును ఇంటిపైకప్పుపై పార్క్ చేసిన యజమాని

Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ - రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్

Konda Surekha Letter To Sonia Gandhi | నన్ను డమ్మీ మంత్రిని చేశారు.. రేవంత్ కావాలనే నన్ను అణగదొక్కారు

India-US Trade Deal | అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ కీలక షరతు

Bhagwant Mann | అత్యాచార కేసుల సెటిల్మెంట్కు సిండికేట్ దందా.. సీఎం భార్యపై బీజేపీ సంచలన ఆరోపణలు



