Mahesh Goud | డీలిమిటేషన్ అయితే 50 సీట్లు మహిళలకే : పీసీసీ చీఫ్
Mahesh Goud | హైదరాబాద్ గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తొలి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జరిగింది. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డీలిమిటేషన్ జరిగితే.. 40 నుంచి 50 సీట్లు మహిళలకే కేటాయిస్తామన్నారు.
Mahesh Goud | హైదరాబాద్ గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ తొలి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధ్యక్షతన జరిగింది. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో డీలిమిటేషన్ జరిగితే.. 40 నుంచి 50 సీట్లు మహిళలకే కేటాయిస్తామన్నారు. పార్టీ అన్ని విభాగాలను బలోపేతం చేయడం, స్థానిక నాయకత్వాన్ని, యువతను ప్రోత్సహించడం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లాకు నలుగురు నుండి ఐదుగురిని నామినేటెడ్ పదవులలో అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ మహిళా కాంగ్రెస్‌లో నాయకులు మర్యాదలు పాటిస్తూ వ్యవహరించాలన్నారు.
పార్టీ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారిస్తూ, మహిళల సామర్థ్యాన్ని ప్రోత్సహిస్తామని అన్నారు. “మహిళలు ప్రపంచ జనాభాలో సగం. మన హక్కుల కోసం మనం పోరాడాలి. పార్టీ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకం” అని పిలుపునిచ్చారు. అమరావతి ప్రాంతంలో నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తామని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే సస్పెన్షన్ వర్తిస్తుందని హెచ్చరించారు. త్వరలో క్రమశిక్షణ కమిటీ, ఆఫీస్ ఇంచార్జి మరియు స్పోక్స్ పర్సన్ నియామకాలు జరుగుతాయని, జిల్లా పర్యటన వివరాలను త్వరలో తెలియజేస్తామని అన్నారు. కార్యక్రమంలో మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



