త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Budget Allocation For Telangana Railway Projects | తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.5454 కోట్లు కేటాయింపులు

ఈ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడంతో హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణ సమయం 2 గంటలు, హైదరాబాద్ - చెన్నై 02.55 గంటలు, హైదరాబాద్ - పూణే మధ్య ప్రయాణ సమయం 01.55 గంటలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

J

Telangana | Published On Feb 2, 2026, 10.00 pm IST

Budget Allocation For Telangana Railway Projects | తెలంగాణ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.5454 కోట్లు కేటాయింపులు
Advertisement

Budget Allocation For Telangana Railway Projects | తెలంగాణ రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి కోసం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్రం రూ.5454 కోట్ల నిధులను కేటాయించింది. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే కేటాయింపులను మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం రూ.47984 కోట్లతో వివిధ రైల్వే ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయన్నారు. న్యూఢిల్లీ నుంచి తెలంగాణ, ఏపీకి సంబంధించిన రైల్వే కేటాయింపుల ముఖ్యాంశాలపై వర్చువల్‌గా సోమవారం కేంద్ర రైల్వే మంత్రి సమావేశం నిర్వహించగా.. సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఇతర సీనియర్ రైల్వే అధికారులు పాల్గొన్నారు.

Telangana state gets rs5454 crore budget allocation for railway projects

ఈ సందర్భంగా అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. 2026-2027 సంవత్సరానికి గాను తెలంగాణ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో రూ.5,454 కోట్ల బడ్జెట్ కేటాయింపులు మంజూరు అయ్యాయని తెలియజేశారు. 2009-14 సంవత్సరాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వార్షిక సగటు బడ్జెట్ వ్యయం రూ.886 కోట్లు మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు 2009-14 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రానికి జరిగిన సగటు కేటాయింపులతో పోలిస్తే దాదాపు ఆరు రెట్లు పెరిగిందని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయని, తెలంగాణలోని రైల్వే నెట్‌వర్క్ ఇప్పుడు 100 శాతం విద్యుదీకరించబడిందని తెలియజేశారు.

Telangana state gets rs5454 crore budget allocation for railway projects

దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించారు. ఈ ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లలో మూడు హైదరాబాద్ నుంచి ప్రారంభించడం వలన ఇవి ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కారిడార్ ఒక త్రిభుజాన్ని ఏర్పరుస్తుంది. విద్య, ఆరోగ్యం, వ్యాపారం మొదలైన వాటికి దోహదపడే ఆర్థిక వృద్ధి కారిడార్‌గా పనిచేస్తుందన్నారు. ఈ హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టడంతో హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణ సమయం 2 గంటలు, హైదరాబాద్ - చెన్నై 02.55 గంటలు, హైదరాబాద్ - పూణే మధ్య ప్రయాణ సమయం 01.55 గంటలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరిచి, పారిశ్రామిక, ఆర్థిక కేంద్రంగా తెలంగాణను అభివృద్ధి చేసేందుకు దోహదపడనున్నాయి.

Telangana state gets rs5454 crore budget allocation for railway projects

Advertisement

తాజావార్తలు

Advertisement