త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Shyam Prasad Reddy | లాస్ట్ మంత్ బీజేపీ ఆఫీసుకు వెళ్లాం.. మ‌రి మేం బీజేపీనా..? : శ్యాం ప్ర‌సాద్ రెడ్డి

Shyam Prasad Reddy | సాగునీటి ప్రాజెక్టుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఏ పార్టీ కోరినా కూడా వెళ్లినం.. కానీ ఏ పార్టీతో కూడా మాకు సంబంధం లేదు అని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్ర‌సాద్ రెడ్డి తేల్చిచెప్పారు. గ‌త నెల‌లో బీజేపీ ఆఫీసుకు వెళ్లి.. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాం.. మ‌రి మేం బీజేపీనా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Jul 13, 2026, 6.21 pm IST

Shyam Prasad Reddy | లాస్ట్ మంత్ బీజేపీ ఆఫీసుకు వెళ్లాం.. మ‌రి మేం బీజేపీనా..? : శ్యాం ప్ర‌సాద్ రెడ్డి
Advertisement

Shyam Prasad Reddy | త్రినేత్ర‌.న్యూస్ : సాగునీటి ప్రాజెక్టుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని ఏ పార్టీ కోరినా కూడా వెళ్లినం.. కానీ ఏ పార్టీతో కూడా మాకు సంబంధం లేదు అని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్ర‌సాద్ రెడ్డి తేల్చిచెప్పారు. గ‌త నెల‌లో బీజేపీ ఆఫీసుకు వెళ్లి.. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టుల‌పై అవ‌గాహ‌న క‌ల్పించాం.. మ‌రి మేం బీజేపీనా..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో శ్యాం ప్ర‌సాద్ రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు.

మేం ఆ పార్టీకి సపోర్టు అనేది సీఎం రాజ‌కీయ వ్యాఖ్య‌.. దానికి మేం ప్రొఫెష‌న‌ల్‌గా ఏం చెప్ప‌గ‌లుగుతాం. మేం తెలంగాణ ఉద్య‌మంలో ఉన్న‌ప్పుడు కూడా ఏ పార్టీ పిలిచినా మేం పోయినం. ఎక్సెప్ట్ స‌మైక్య రాష్ట్రాన్ని స‌మ‌ర్థించే పార్టీల‌ను త‌ప్పించి ఏ పార్టీ పిలిచినా వెళ్లినం. ప్రాజెక్టుల విష‌యంలో అవ‌గాహ‌న క‌ల్పించాం. నెల రోజుల క్రితం బీజేపీ అధికార ప్ర‌తినిధి తాడూరి శ్రీనివాస్ పిలిచి మేం 45 మంది అధికార ప్ర‌తినిధులం ఉన్నాం. కృష్ణా న‌ది మీద ఉన్న ప్రాజెక్టుల గురించి అవేర్నెస్ కావాల‌ని అడిగితే.. 2009 త‌ర్వాత నేను ఎన్న‌డు శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ భ‌వ‌న్‌కు పోలేదు. లాస్ట్ మంత్ వెళ్లి ఒక గంట సేపు వారికి వివ‌రించి రావ‌డం జ‌రిగింది. మ‌రి మేం బీజేపీనా.. కాదు క‌దా.. బీఆర్ఎస్ వాళ్లు పిలిస్తే కూడా మా సెక్ర‌ట‌రీ, మా గౌర‌వ అధ్య‌క్షుడు కూడా వెళ్లారు. మొన్న ఈట‌ల రాజేంద‌ర్ ప్రెస్‌మీట్ పెడుతున్నాం రావాన్నారు. పార్టీతో మాకు సంబంధం లేదు కాబ‌ట్టి మేం ఎక్క‌డికైనా పోగ‌లుగుతాం అని శ్యాం ప్ర‌సాద్ రెడ్డి పేర్కొన్నారు.

మేం ఏ ప‌ద‌వి ఆశించ‌కుండా ప‌ని చేశాం

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, రైతాంగానికి ఉప‌యోగ‌ప‌డేది ఏది ఉన్నా చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ప‌ద‌వులు ఆఫ‌ర్ చేసినా వ‌ద్ద‌న్న‌వాళ్లం. మేం ఏ ప‌ద‌వి ఆశించ‌కుండా ప‌ని చేశాం. ఇప్పుడు కూడా అదే మ‌నసుతో ఉన్నాం. ఈ ప్ర‌భుత్వానికి విన్న‌వించేది ఏంటంటే తెలంగాణ‌లో మేధావులు, అనుభ‌వ‌మున్న రిటైర్డ్ ఇంజినీర్లు ఉన్నారు. అన్ని తీర్లా ప్రాజెక్టులు, స్ట్ర‌క్చ‌ర్లు క‌ట్టిన వారు ఉన్నారు. వాళ్ల‌తో చ‌ర్చించండి. అదే విధంగా విశ్వ‌విద్యాల‌యాల్లో ప్రొఫెస‌ర్లు ఉన్నారు. మాకు చెప్పిన‌టువంటి డాక్ట‌ర్ బాబురావు.. ఆయ‌న సాయిల్ మెకానిక్స్‌లో వారు అస‌లు అథారిటీ ఇన్ ఇండియా వ‌న్ ఆఫ్ ది బెస్ట్ ప‌ర్స‌న్స్ ఇన్ ఇండియా ఆయ‌న. మా యొక్క నిర్ణ‌యం వారికి చెప్ప‌గానే శ్యామ్ ప్ర‌సాద్ ఇట్ ఈస్ ఏ రైట్ డెసిష‌న్ ఎట్ ది రైట్ టైమ్ అని చెప్పారు. అదే విధంగా పీజీ శాస్త్రి గారు వారు 93 ఏళ్ల పెద్ద మ‌నిషి. ఆయ‌న వ‌రంగ‌ల్ ఆర్ఈసీకి డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశారు. స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్‌లో వాలంత‌రీలో కూడా డీజీగా ప‌ని చేశారు. అయితే ఆయ‌న ఇప్ప‌టికీ కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నారు. వారు కూడా ఇంతకు ముందు స‌మ‌ర్థించారు. కాబ‌ట్టి మేం దీన్ని తీసుకునే ముందు చాలా మందితో మాట్లాడి చేసిన త‌ర్వాత‌నే ప్ర‌భుత్వానికి సూచ‌న చేయ‌డం జ‌రిగింది కానీ మేము ఒక పార్టీకో, దానికో దీనికో దృష్టిలో పెట్టుకుని చేసింది కాదు ఇది అని శ్యాం ప్ర‌సాద్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement