Damoder Reddy | కాళేశ్వరంలోనే నీళ్లు.. ఎత్తిపోస్తే ఏ ఒక్క ఊరు మునగదు : దామోదర్ రెడ్డి
Damoder Reddy | ప్రస్తుతం నీళ్లు ఎక్కడ ఉన్నాయంటే కేవలం కాళేశ్వరంలోనే ఉన్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తెలిపారు. ఈ నీళ్లను ఎత్తిపోయం ద్వారా ఏ ఒక్క ఊరు మునగదు.. భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన తేల్చిచెప్పారు.
Damoder Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రస్తుతం నీళ్లు ఎక్కడ ఉన్నాయంటే కేవలం కాళేశ్వరంలోనే ఉన్నాయని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి తెలిపారు. ఈ నీళ్లను ఎత్తిపోయం ద్వారా ఏ ఒక్క ఊరు మునగదు.. భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదని ఆయన తేల్చిచెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దామోదర్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చింది. నీళ్లు స్టోరేజ్ చేయొద్దన్నారు ఓకే. అన్ని గేట్లు ఓపెన్ చేసి పెట్టి ఉన్నారు. వరద వస్తున్నది పోతున్నది. ఆ వచ్చే వరద లెవల్ ఎలా ఉందంటే పంపులు ఆన్ చేసే దాని కన్నా ఎక్కువనే ఉంది కాబట్టి పంపులు రన్ చేయొచ్చు.. ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత దానిపై అన్నారం, సుందిళ్ల రెండు బ్యారేజీలు ఉన్నాయి. వాటికి ఎంత రెండింటికి కలిపితే 8 టీఎంసీలు, 9 టీఎంసీలు మాక్సిమం స్టోరేజ్ చేయొచ్చు రెండు కలిపి ఏది మీడియం లెవల్ రావడానికి. ఆ రెండు కూడా వాల్ ఆఫ్ ఏ సడెన్ ఒకటే రోజు రెండు కూలిపోయినయి అనుకుందాం.. ఆ వచ్చే ఫ్లడ్ నార్మల్‌గా పోయే ఫ్లడ్‌లో 15 శాతం, 20 శాతమే ఉంటది. ఎక్కువలో ఎక్కువ 30 శాతం ఉంటది. అంతకన్నా ఎక్కువ లేదు కాబట్టి ఏ ఒక్క ఊరు మునగదు. భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేదు అని ఆయన స్పష్టం చేశారు.
అదొక్కటే దిక్కు మనకు..
ప్రస్తుతం నీళ్లు ఎక్కడ ఉన్నాయంటే ఓన్లీ కాళేశ్వరంలోనే ఉన్నాయి. ఎక్కడా లేవు. ఎక్కడైనా ఉంటే అక్కడ్నుంచి కూడా తీసుకోవచ్చు. కానీ ఎక్కడా లేవు. మోస్తరు వర్షాలు పడితే ఎల్లంపల్లికి వస్తే రావొచ్చు. అదర్‌వైస్ కాళేశ్వరంలోనే నీళ్లు ఉన్నాయి. అదొక్కటే దిక్కు మనకు. సగం తెలంగాణను ఆదుకునేదే అదే. నల్లగొండకు కూడా నీళ్లు ఇవ్వొచ్చు.. ఏదైనా స్కీమ్ తయారు చేస్తే నాగార్జున సాగర్ కెనాల్‌లో కూడా పంపు చేసి ఈ నీళ్లు పోయొచ్చు అని దామోదర్ రెడ్డి తెలిపారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
జులై 13, 2026

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026

Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026
తాజావార్తలు
- ●KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
- ●CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
- ●Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...
- ●Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
- ●Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
- ●Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ 'గురుదక్షిణ'.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?

Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం



