Shyam Prasad Reddy | జైల్లో పెట్టండి.. మేం స్వాగతిస్తున్నాం.. శ్యాం ప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Shyam Prasad Reddy | రాష్ట్రంలోని అవినీతిపరులందరూ జైల్లో ఉండాల్సిందే.. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లు కూడా సరిపోకపోతే.. ఇంకో కొత్త జైలు కట్టండి అని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు.
Shyam Prasad Reddy | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని అవినీతిపరులందరూ జైల్లో ఉండాల్సిందే.. చర్లపల్లి, చంచల్‌గూడ జైళ్లు కూడా సరిపోకపోతే.. ఇంకో కొత్త జైలు కట్టండి అని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాం ప్రసాద్ రెడ్డి( Shyam Prasad Reddy )కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై శ్యాం ప్రసాద్ రెడ్డి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి గారి మీద పొలిటికల్‌గా ఎలాంటి ఫోర్స్ ఉందో మాకు తెల్వదు. అవినీతి చేసినటువంటి వీళ్లు జైల్లో ఉండాల్సింది.. జైల్లో పెట్టకపోవడం నా తప్పు అని సీఎం అన్నారు కదా. ఇప్పటికైనా పర్వాలేదు.. అవినీతిపరులందరూ కూడా జైల్లో ఉండాల్సిందే. చర్లపల్లి జైలో, చంచల్‌గూడ జైలో.. అవి సరిపోకపోతే ఇంకో కొత్త జైలు కట్టండి. కానీ ప్రజల సొమ్ము తిన్నటువంటి అవినీతిపరులందరూ కూడా జైల్లో ఉండాల్సిందే. అందర్నీ విచారించండి.. రిటైర్డు ఇంజినీర్లే ఏంది.. చాలా ఉన్నారు. మీకు ఎవరెవరి మీద అనుమాలు ఉన్నాయో వారందరి మీద విచారణ చేసి జైల్లో పెట్టండి. దాన్ని మేం స్వాగతిస్తున్నాం.. అభినందిస్తున్నామని శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
డిండి నుంచి నీళ్లు వస్తేనే ఫ్లోరోసిస్ వ్యాధికి శాశ్వత పరిష్కారం
మమ్మల్ని అవమానించేలా మాట్లాడడంతో.. ఇంజినీర్లు అందరూ కూడా తమ యొక్క బాధను వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఆటోమేటిక్‌గా రియల్లీ సార్ ఇంత మీరు హానెస్ట్‌గా ఉండి ఇంత పని చేసి రిటైర్ అయినా కూడా.. నౌ ఐ విల్ బీ కంప్లీటింగ్ 76 ఇయర్స్ బై దిస్ సెప్టెంబర్ టెన్త్. మరి మేం ఈ ఏజ్‌లో కూడా తిరుగుతున్నాం.. చేస్తున్నాం.. ఉదయం నుంచి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మేం వాళ్లకు అటెండ్ చేస్తున్నాం.. అన్ని చేస్తున్నాం. ఐ హేల్ ఫ్రమ్ నల్లగొండ మునుగోడు బ్యాక్‌వర్డ్ అంటే బ్యాక్‌వర్డ్ ఏరియాలో ఆ ఏరియాకు రావాల్సిన డిండి ప్రాజెక్టు ఇంత వరకు గత ప్రభుత్వం 10 ఏండ్లలో కూడా దానికి ఎక్కడ్నుంచి నీళ్లు తీసుకురావాలని నిర్ణయం చేయకుండా పోయింది ఆ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్రిషియేట్ చేసినం మేం. కనీసం ఎక్కడనేది ఫైనల్ చేసి దానికి టెండర్ క్వాలిఫైర్ చేసి అగ్రిమెంట్లు చేసింది. చేసిన తర్వాత 10 నెలలకు ఇప్పుడు ఏదో లెవల్ అఫ్రూవల్ గురించి 10 నెలలు పట్టింది. ఇంకా అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయనేలేదు ఆ హెడ్ వర్క్స్ కావాలంటే. డిండి నుంచి నీళ్లు వస్తేనే మునుగోడు, దేవరకొండ ప్రాంతాల్లో ఫ్లోరోసిస్ వ్యాధికి శాశ్వత పరిష్కారం. ఎన్ ఇంజినీరింగ్ సొల్యూషన్ టు హెల్త్ ఇష్యూ అని చెప్పేసి మేం దానికి ట్యాగ్ లైన్‌గా పెట్టినమని ఆయన గుర్తు చేశారు.
మేం ఏ ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కాదు..
ఆ ప్రాజెక్టును గత ప్రభుత్వం టోటల్‌గా నెగ్లెక్ట్ చేసింది. ఆ విషయంలో కేసీఆర్‌ను ఎన్నోసార్లు మేం విన్నవించుకున్నాం. ఎక్కడ్నుంచి అనేది ఆయన డిసైడ్ చేయలేదు. ఒకసారి నార్లాపూర్ అంటారు.. ఒకసారి ఏదుల అంటారు.. ఒకసారి వట్టెం అంటారు. ఏ నుంచి లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చి వెళ్లిపోయిన తర్వాత ఐ రియల్లీ అప్రిషియేట్ దిస్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ అవర్ చీఫ్ మినిస్టర్ అండ్ అవర్ ఇరిగేషన్ మినిస్టర్ ఫర్ డిసైడింగ్ ది టేకింగ్ పాయింట్ ఆఫ్ ఇంటేక్ వెల్.. ఎక్కడ్నుంచి తీసుకోవాలనేది డిసైడ్ చేశారు. ఎస్టిమేట్ చేయించారు. టెండర్ క్వాలిఫైర్ చేశారు. అగ్రిమెంట్ చేయించారు. నిన్నమొన్న ఏదో అప్రూవల్ అయ్యాయి లెవల్స్ స్టార్ట్ అయితదని కూడా చెప్పారు. కాబట్టి ఏ ప్రభుత్వాన్నైనా మంచి చేస్తే మంచి అంటం.. లేకుంటే వారి దృష్టికి తెస్తాం బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. మేం ఏ ప్రభుత్వాన్ని విమర్శించినట్టు కాదు.. ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినట్టు కాదు.. వి విల్ అప్రిషియేట్ ఇట్ నాట్ సపోర్ట్.. వి విల్ అప్రిషియేట్.. దట్స్ ఆల్ అని శ్యాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
జులై 13, 2026

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
జులై 13, 2026

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
జులై 13, 2026
తాజావార్తలు
- ●KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ
- ●CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?
- ●Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...
- ●Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం
- ●Tanneru Venkatesham | నీళ్లను ఒడిసి పట్టండి.. తాగునీటికే 40 టీఎంసీలు అవసరం : తన్నీరు వెంకటేశం
- ●Revanth Reddy | చంద్రబాబుకు రేవంత్ 'గురుదక్షిణ'.. సుప్రీంకోర్టులో బట్టబయలైన కుట్ర

KTR | అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య మనువడికి కేటీఆర్ ప్రత్యేక లాకెట్ బహుకరణ

CM Revanth Reddy Delhi Tour | రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఆ లిస్ట్ రెడీ అయినట్టేనా?

Bhagyashri Borse | సమంత మా అందరికి ఓ దారి చూపించింది - భాగ్యశ్రీ బోర్సే కామెంట్స్...

Tanneru Venkatesham | రైతు భరోసా ఇచ్చారు.. మరి నీళ్లు ఇవ్వకుంటే ఏం లాభం..? : తన్నీరు వెంకటేశం



