POLYCET Results | 11.30కి పాలిసెట్ ఫలితాలు.. మే 27 నుంచి కౌన్సెలింగ్
POLYCET Results | తెలంగాణ పాలిసెట్ ఫలితాలు (POLYCET Results) శనివారం విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష (POLYCET) ఫలితాలను శనివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని సాంకేతిక విద్య బోర్డు కార్యాలయంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన విడుదల చేస్తారు.
POLYCET Results | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు (POLYCET Results) శనివారం విడుదల కానున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష (POLYCET) ఫలితాలను శనివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని సాంకేతిక విద్య బోర్డు కార్యాలయంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన విడుదల చేస్తారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల మొబైల్ ఫోన్‌కు నేరుగా ఫలితాలు అందనున్నాయి. ఈ ఫలితాలను అధికారి వెబ్‌సైట్ https://polycet.sbtet.telangana.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్షకు మొత్తం 98,028 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 27 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. రెండు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని, ఇటీవల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. పాలిసెట్‌లో సాధించిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులకు పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. కాగా, కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతులు జూన్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం





