త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Martyrs | తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం..!

Telangana Martyrs | తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లంతో పాటు నిర్మాణానికి ఆర్థిక సాయం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, పిల్లలకు ఉచిత విద్య, స్వయం ఉపాధి రుణాలు కోరుతున్నార‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారుల గుర్తింపు క‌మిటీ వెల్ల‌డించింది.

S

Telangana | Published On Aug 18, 2026, 5.29 pm IST

Telangana Martyrs | తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లం..!
Advertisement

Telangana Martyrs | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ ఉద్య‌మ‌కారుల‌కు 250 గ‌జాల ఇంటి స్థ‌లంతో పాటు నిర్మాణానికి ఆర్థిక సాయం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం, పిల్లలకు ఉచిత విద్య, స్వయం ఉపాధి రుణాలు కోరుతున్నార‌ని తెలంగాణ ఉద్య‌మ‌కారుల గుర్తింపు క‌మిటీ వెల్ల‌డించింది. ఉద్య‌మ‌కారుల గుర్తింపు క‌మిటీ చైర్మ‌న్ కే కేశ‌వ‌రావుతో క‌మిటీ స‌భ్యుల అత్యున్న‌త స్థాయి భేటీ జ‌రిగింది. ఈ సంద‌ర్భఃగా ఉద్య‌మ‌కారుల వ‌ర్గీక‌ర‌ణ ముసాయిదా, సంక్షేమ విధివిధానాల‌పై స‌మీక్షించారు. ఈ కీలక భేటీలో మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ఇటీవల అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, వివిధ జేఏసీలతో నిర్వహించిన విస్తృత సంప్రదింపుల ద్వారా సేకరించిన అభిప్రాయాలు, విజ్ఞప్తుల ఆధారంగా రూపొందించిన "చర్చలపై ఒక ముసాయిదా నోట్" పై ఈ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. ఈ సంద‌ర్భంగా ఉద్య‌మ‌కారుల‌ను కేట‌గిరీల వారిగా విభ‌జించారు.

మొదటి కేటగిరీ (అమరుల కుటుంబాలు):

ఉద్యమ క్రమంలో అమరులైన వారు (సుమారు 1400 మంది వరకు సమాచారం ఉండగా, గతంలో కొందరికి మాత్రమే సహాయం అందింది). మిగిలిన అర్హులైన అమరుల కుటుంబాలను గుర్తించి పూర్తి న్యాయం చేయడం.

రెండవ కేటగిరీ (గాయపడిన ఉద్యమకారులు):

పోలీసు కాల్పుల్లో, లాఠీచార్జీల్లో శాశ్వత అంగవైకల్యం పొందిన వారు మరియు ఆత్మహత్యాయత్నాల్లో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులు.

మూడవ కేటగిరీ (జైలు జీవితం గడిపిన వారు):

తొలిదశ (1969), మలిదశ ఉద్యమాల్లో ప్రివెంటివ్ కస్టడీ, రిమాండ్, తీవ్ర జైలు శిక్షలు అనుభవించిన విద్యార్థులు, ఉద్యమకారులు.

నాల్గవ కేటగిరీ (కేసులు నమోదైన వారు):

నాటి ఉద్యమ సమయంలో క్రిమినల్ కేసులు, బెయిలబుల్/నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు ఎదుర్కొన్న శ్రేణులు.

ప్రత్యేక కేటగిరీలు (సంస్థాగత & క్రియాశీలక శ్రేణులు):

కేసులు నమోదు కానప్పటికీ.. ఉద్యమ నిర్మాణంలో క్రియాశీలకంగా పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులు, మహిళా ఉద్యమకారులు, ధూమ్-ధామ్ కళాకారులు, వివిధ సంస్థల సభ్యులు.

Advertisement
Advertisement