Telangana Journalists | జీవో 252ను సవరించాల్సిందే.. కలెక్టరేట్లలో జర్నలిస్టుల నిరసన
Telangana Journalists | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో 252పై జర్నలిస్టులు సమరభేరి మోగించారు. ఈ జీవో వల్ల డెస్కు జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు.
అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టుల డిమాండ్
Telangana Journalists | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో 252పై జర్నలిస్టులు సమరభేరి మోగించారు. ఈ జీవో వల్ల డెస్కు జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ.. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. జీవో 252ను సవరించి డెస్కు జర్నలిస్టులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఒకే గొడుగు కింద పని చేసే జర్నలిస్టులను రిపోర్టర్లు, డెస్కు జర్నలిస్టుల పేరిట విభజించి.. తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఫీల్డ్ రిపోర్టర్లకు అక్రిడిటేషన్ కార్డు, డెస్కు జర్నలిస్టులకు మీడియా కార్డు జారీ చేయాలని రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టులందరూ ముక్త కంఠంతో ఖండించారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన మాదిరిగానే డెస్కు జర్నలిస్టులకు కూడా పూర్తిస్థాయి అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే 10 వేల మంది జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
డెస్కు జర్నలిస్టుల ఉద్యమానికి టీడబ్ల్యూజేఎఫ్, డీజేఎఫ్ టీ, టీయూడబ్ల్యూజే, హెచ్‌యూజే వంటి సంస్థలు మద్దతు తెలిపాయి. ఈ యూనియన్ల నాయకులు కూడా కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టి, డెస్కు జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించాయి. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే తమ కార్యాచరణను ప్రకటిస్తామని డెస్కు జర్నలిస్టులు హెచ్చరించారు. త్వరలోనే హైదరాబాద్ నగరంలో మహా ధర్నా చేపడుతామన్నారు.
జర్నలిస్టుల ప్రధాన డిమాండ్లు ఇవే..
జర్నలిస్టులను విభజించే జీవో 252ను వెంటనే సవరించాలి.
డెస్కు జర్నలిస్టులకు పాత పద్ధతిలోనే అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలి.
అక్రిడిటేషన్ కమిటీలలో డెస్కు జర్నలిస్టులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి.
చిన్న, మధ్య తరహా పత్రికలకు, వెబ్‌సైట్ జర్నలిస్టులకు న్యాయం చేయాలి.

హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ధర్నా

హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల నిరసన ప్రదర్శన

కరీంనగర్ జిల్లాలో జర్నలిస్టుల నిరసన

హనుమకొండ కలెక్టరేట్ వద్ద

నల్లగొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా..

సూర్యాపేటలో కదం తొక్కిన జర్నలిస్టులు

ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ ఏవోకు వినతిపత్రం సమర్పించిన జర్నలిస్టులు

మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టరేట్‌లో

వనపర్తిలో అడిషనల్ కలెక్టర్ యాదయ్యకు వినతి పత్రం అందిస్తూ..

నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల నిరసన
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



