త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Inter Practical Exams | జంబ్లింగ్ విధానంలో ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు..!

Inter Practical Exams | ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఇది కాస్త చేదు వార్తే. గ‌తేడాది వ‌ర‌కు ఏ కాలేజీ విద్యార్థుల‌కు ఆ క‌ళాశాల‌లోనే ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవారు. కానీ ఈ సారి ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్‌ను జంబ్లింగ్ విధానంలో నిర్వ‌హించేందుకు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు క‌స‌ర‌త్తు చేస్తుంది.

S

Telangana | Published On Dec 16, 2025, 3.23 pm IST

Inter Practical Exams | జంబ్లింగ్ విధానంలో ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు..!
Advertisement

Inter Practical Exams | హైద‌రాబాద్ : ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఇది కాస్త చేదు వార్తే. గ‌తేడాది వ‌ర‌కు ఏ కాలేజీ విద్యార్థుల‌కు ఆ క‌ళాశాల‌లోనే ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేవారు. కానీ ఈ సారి ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్‌ను జంబ్లింగ్ విధానంలో నిర్వ‌హించేందుకు తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు క‌స‌ర‌త్తు చేస్తుంది.

జంబ్లింగ్ విధానం అంటే..?

ఇంట‌ర్ విద్యార్థుల‌కు 2026 ఫిబ్ర‌వ‌రి 2వ తేదీ నుంచి ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ఇంట‌ర్ బోర్డు నిర్ణ‌యించింది. అయితే ఈ సారి కొత్త‌గా ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్‌ను జంబ్లింగ్ విధానంలో నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. అంటే ఒక కాలేజీ విద్యార్థుల‌కు మ‌రో క‌ళాశాల కేటాయించి అక్క‌డ‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం.

ఇంట‌ర్ బోర్డు ఈ కొత్త విధానాన్ని మొద‌ట‌గా ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల‌లో అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ల్యాబ్ సౌక‌ర్యాలు పూర్తిస్థాయిలో ఉన్న ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల‌ను ప‌రీక్షా కేంద్రాలుగా కేటాయించ‌నున్నారు. అన్ని ర‌కాల ప‌రిక‌రాలు ఉన్న ల్యాబ్‌ల‌ను త్వ‌ర‌లోనే గుర్తించి, వాటిని ప‌రీక్షా కేంద్రాలుగా కేటాయించ‌నున్న‌ట్లు స‌మాచారం.

జంబ్లింగ్ విధానంలో ప్రాక్టిక‌ల్స్ నిర్వ‌హిస్తున్న నేప‌థ్యంలో స‌ద‌రు ప‌రీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల‌తో ప‌ర్య‌వేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అన్ని ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీల్లో సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ల్యాబ్‌ల‌కు కూడా వీటిని విస్త‌రించ‌నున్నారు. వీట‌న్నింటిని హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప్ర‌ధాన కార్యాల‌యానికి అనుసంధానం చేయ‌నున్నారు. బోర్డు అధికారులు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ.. మాల్ ప్రాక్టీస్‌తో పాటు ఇత‌ర త‌ప్పిదాల‌ను కంట్రోల్ చేయ‌నున్నారు.

ఫిబ్ర‌వ‌రి 2 నుంచి 21 వ‌ర‌కు ప్రాక్టిక‌ల్స్

ఫిబ్ర‌వ‌రి 2 నుంచి 21వ తేదీ వ‌ర‌కు రోజుకు రెండు సెష‌న్ల‌లో ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఆదివారాల్లోనూ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగ‌నుంది. ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు తొలి సెష‌న్, మ‌ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు రెండో సెష‌న్ నిర్వ‌హించ‌నున్నారు. ఇక ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు ఇంగ్లీష్ ప్రాక్టిక‌ల్ ఎగ్జామ్స్‌ను జ‌న‌వ‌రి 21, 22 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. జ‌న‌వ‌రి 23, 24 తేదీల్లో ఎథిక్స్, హ్యుమ‌న్ వాల్యూస్ ఎగ్జామ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ రెండు ప‌రీక్ష‌లు కూడా ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు కొన‌సాగ‌నున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement