Vakiti Srihari | సురేఖ, వాకిటియే కాదు.. ఎవరైనా పార్టీ తర్వాతే
Vakiti Srihari | సురేఖ, వాకిటియే కాకుండా ఇంకెవరైనా పార్టీ తర్వాతనేనని.. ముందు పార్టీని కాపాడుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. సురేఖ అక్కపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. ఆమె కూతురు మాటలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయన్నారు.
- సురేఖ కూతురు మాటలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయి
- ముందు పార్టీని కాపాడుకోవాలి.. దానికి అనుగుణంగా ముందుకెళ్తాం
- సురేఖ అక్కపై కుట్ర ఏం లేదు.. పార్టీ లైన్ దాటితే వాకిటి శ్రీహరిపై కూడా చర్యలుంటయ్
- బీసీలు, అగ్రవర్ణాలు అని ఏం ఉండదు.. కాంగ్రెస్ సామాజిక న్యాయాన్ని పాటిస్తది
- మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యలు
Vakiti Srihari | త్రినేత్ర.న్యూస్: సురేఖ, వాకిటియే కాకుండా ఇంకెవరైనా పార్టీ తర్వాతనేనని.. ముందు పార్టీని కాపాడుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. సురేఖ అక్కపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. ఆమె కూతురు మాటలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయన్నారు. బీసీలు, అగ్రవర్ణాలు అనే తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని చెప్పారు. రేపు వాకిటి కూడా పార్టీ లైన్ దాటితే చర్యలుంటాయని పేర్కొన్నారు. ఏఐసీసీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. ఆదివారం ఆయన ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ముందు పార్టీ నీ కాపాడుకోవాలి. దానికి అనుగుణంగా ముందుకు పోతాం. పార్టీ లైన్ దాటితే వాటికి శ్రీహరిపై కూడా చర్యలు తప్పవు. పార్టీకి డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సురేఖ అక్కపై కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికి లేదు. పార్టీకి డ్యామేజ్ అయితే ఏఐసీసీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది.
ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వొద్దు..
ఎవరూ పార్టీ లైన్ దాటొద్దు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయినప్పటికీ ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి చేసినా.. అనుభవం కలిగిన రేవంత్ హయాంలో ప్రభుత్వం ముందుకు పోతుంటే ఇలాంటివి జరగటం బాధాకరం. ప్రతి పక్షాలకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సురేఖ అక్క ఒక్కదానికే నోటీస్ ఇవ్వలేదు.. చిన్నారెడ్డికి కూడా నోటీస్ ఇచ్చారు. తప్పు చేస్తే ఎవరిపైన అయిన చర్యలు ఉంటాయి. సామాజిక న్యాయం పాటించేది కాంగ్రెస్ పార్టీ అని మంత్రి వాకిటి స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●G Jgadeesh Reddy | కాంగ్రెస్, బీజేపీ నాటకం బయటపడింది
- ●NBK 111 | సంక్రాంతి రేసు నుంచి బాలయ్య ఔట్ - ఎన్బీకే 111 రిలీజ్ డేట్ ఇదేనా?
- ●Parliament Monsoon Session | పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యం.. తెరవెనుక కేంద్రం వ్యూహమేంటి?
- ●Ganesh Bigala | నిజామాబాద్ ప్రజలను పొంగులేటి మోసం చేశారు
- ●TGEHS | ఈహెచ్ఎస్పై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి.. దేవీప్రసాద్ డిమాండ్..
- ●Meenakshi Chaudhary | ‘కాకా’లో మీనాక్షి చౌదరి.. మెగాస్టార్ సినిమాలో అదిరిపోయే రోల్!

G Jgadeesh Reddy | కాంగ్రెస్, బీజేపీ నాటకం బయటపడింది

NBK 111 | సంక్రాంతి రేసు నుంచి బాలయ్య ఔట్ - ఎన్బీకే 111 రిలీజ్ డేట్ ఇదేనా?

Parliament Monsoon Session | పార్లమెంట్ సమావేశాల ముగింపులో జాప్యం.. తెరవెనుక కేంద్రం వ్యూహమేంటి?

Ganesh Bigala | నిజామాబాద్ ప్రజలను పొంగులేటి మోసం చేశారు




