త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rainfall | తెలంగాణ‌లో త‌గ్గిన 10 శాతం లోటు వ‌ర్ష‌పాతం..!

Rainfall | గ‌త రెండు, మూడు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు( Rains ) కురుస్తున్నాయి. ఉత్త‌ర తెలంగాణ‌( North Telangana ) లోని జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ద‌క్షిణ తెలంగాణ‌( South Telangana )లో మాత్రం మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తున్నాయి.

S

Telangana | Published On Jul 30, 2026, 6.07 pm IST

Rainfall | తెలంగాణ‌లో త‌గ్గిన 10 శాతం లోటు వ‌ర్ష‌పాతం..!
Advertisement

Rainfall | త్రినేత్ర‌.న్యూస్ : గ‌త రెండు, మూడు రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వ‌ర్షాలు( Rains ) కురుస్తున్నాయి. ఉత్త‌ర తెలంగాణ‌( North Telangana ) లోని జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ద‌క్షిణ తెలంగాణ‌( South Telangana )లో మాత్రం మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తున్నాయి. మొత్తానికి ఈ వాన‌ల వ‌ల్ల రైతులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఈ వ‌ర్షాల వ‌ల్ల తెలంగాణ వ్యాప్తంగా 10 శాతం లోటు వ‌ర్ష‌పాతం( Rainfall ) త‌గ్గింద‌ని ఐఎండీ హైద‌రాబాద్ వెల్ల‌డించింది. 15 రోజుల క్రితం రాష్ట్రంలో లోటు వ‌ర్ష‌పాతం 33 శాతం ఉండ‌గా, గురువారం ఉద‌యం నాటికి మ‌రో 10 శాతానికి లోటు వ‌ర్ష‌పాతం త‌గ్గింద‌ని పేర్కొంది. అయిన‌ప్ప‌టికీ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 20 శాతం కంటే త‌క్కువ‌నే వ‌ర్ష‌పాతం న‌మోదైన‌ట్లు తెలిపింది. ఒక్క యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాల్లోనే అత్య‌ధికంగా 65 శాతం లోటు వ‌ర్ష‌పాతం నమోదైంది. హైద‌రాబాద్ న‌గ‌రంలో అయితే లోటు వ‌ర్ష‌పాతం కొన‌సాగుతూనే ఉంది.

గుళ్ల‌కోట‌లో 70.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు

ఇక నిన్న కురిసిన భారీ వ‌ర్షాల‌కు జ‌గిత్యాల జిల్లాలోని గుళ్ల‌కోట‌లో 70.5 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోదు క‌గా, ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌(యూ)లో 66.6 మీ.మీ. వ‌ర్షపాతం న‌మోదైన‌ట్లు టీజీడీపీఎస్ వెల్ల‌డించింది. జూలై 29న కురిసిన వ‌ర్షానికి హైద‌రాబాద్ న‌గ‌రం అత‌లాకుత‌ల‌మైంది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. జ‌న‌జీవ‌నం స్తంభించిపోయింది. ప‌లు చోట్ల ట్రాఫిక్‌కు అంత‌రాయం క‌ల‌గింది. కొన్ని ప్రాంతాల్లో గంట‌ల త‌ర‌బ‌డి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఉత్త‌ర తెలంగాణ‌కు రెడ్ అల‌ర్ట్

ఉత్త‌ర తెలంగాణ‌లోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల‌, నిర్మ‌ల్, జ‌గిత్యాల జిల్లాల‌కు వాతావ‌ర‌ణ కేంద్రం రెడ్ అల‌ర్డ్ జారీ చేసింది. గురువారం మ‌ధ్యాహ్నం ఒంటి గంట నుంచి శుక్ర‌వారం ఉద‌యం 8.30 గంట‌ల వ‌ర‌కు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. ఇత‌ర ప్రాంతాల్లో తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. రెడ్ అల‌ర్ట్ జారీ చేసిన ప్రాంతాల్లో 204 మి.మీ. వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది.

Advertisement
Advertisement