త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Graduate MLC Elections | సీఎం రేవంత్‌ను కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం

తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కీలక వ్యూహాలపై చర్చించిన రామ్మోహన్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి.

J

Telangana | Published On Sep 30, 2026, 3.49 pm IST

Telangana Graduate MLC Elections | సీఎం రేవంత్‌ను కలిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం

సంక్షిప్త సారాంశం

తెలంగాణలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డి, నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి ఎంపికయ్యారు. టికెట్ ఖరారైన అనంతరం ఇద్దరు అభ్యర్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఓటర్ల నమోదు, ప్రచార కార్యాచరణపై అభ్యర్థులకు సీఎం రేవంత్ పలు కీలక సూచనలు చేశారు.

Advertisement

Telangana Graduate MLC Elections | త్రినేత్ర న్యూస్ : తెలంగాణలో త్వరలో జరగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు రాజకీయ వేడి మొదలైంది. ఈ ఎన్నికలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించిన వెంటనే, వారు రంగంలోకి దిగారు. టికెట్ దక్కించుకున్న సామ రామ్మోహన్ రెడ్డి, రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకంతో అవకాశం కల్పించినందుకు సీఎంకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Telangana Graduate MLC Congress Announces Candidates; Key Strategy Behind the Choice

సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు అభ్యర్థులను ఆత్మీయంగా అభినందించారు. ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రారంభించినందున, వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని వారికి స్పష్టం చేశారు. గ్రాడ్యుయేట్ ఓట్ల నమోదును ముమ్మరం చేయడంతో పాటు, క్షేత్రస్థాయి ప్రచార వ్యూహాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

మార్చి నాటికి ఖాళీ.. రంగంలోకి ఈసీ

రాష్ట్రంలోని ఇద్దరు పట్టభద్రుల ఎమ్మెల్సీల పదవీ కాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. దీంతో ఎన్నికల కమిషన్ సన్నాహాలు ముమ్మరం చేసి సోమవారం నుంచే ఓటర్ల నమోదును ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ముందస్తు వ్యూహంతో అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసింది.

టీపీసీసీ పంపిన ఆరుగురు ఆశావహుల జాబితాను పరిశీలించిన ఏఐసీసీ, తుది నిర్ణయం తీసుకుంటూ కేసీ వేణుగోపాల్ ద్వారా ప్రకటన విడుదల చేయించింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం స్థానానికి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. రెండు స్థానాలనూ రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించడం పార్టీ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Telangana Graduate MLC Congress Announces Candidates; Key Strategy Behind the Choice

బలమైన రాజకీయ నేపథ్యంతో సర్వోత్తమ్ రెడ్డి

నల్లగొండ-వరంగల్-ఖమ్మం అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి తనయుడు. మొదటి నుంచీ యూత్ కాంగ్రెస్‌తో పాటు జిల్లా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుడిగా ఉన్న ఆయన, పార్టీ యువజన విభాగంలో వివిధ కీలక బాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించారు.

పార్టీ వాయిస్‌గా నిలిచిన సామ రామ్మోహన్ రెడ్డి

రంగారెడ్డి జిల్లాకు చెందిన సామ రామ్మోహన్ రెడ్డి న్యాయవాదిగా, రాజకీయ విశ్లేషకుడిగా పార్టీలో సుపరిచితులు. ప్రస్తుతం టీపీసీసీ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా, ముఖ్య అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీగా, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, నేషనల్ స్పోక్స్ పర్సన్‌‌గా, లీగల్ సెల్ కో-ఆర్డినేటర్‌గా పార్టీకి సేవలందించిన అనుభవం ఆయనకు ఉంది.

Advertisement
Advertisement