Telangana Govt | ఉద్యోగుల జీతం నుంచి 15 శాతం కట్.. ఆమోదం తెలపనున్న శాసనసభ
Telangana Govt | ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పదేపదే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే.
Telangana Govt | త్రినేత్ర.న్యూస్ : ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తమ తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాలని పదేపదే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడకుంటే.. వారి వేతనం నుంచి కొంత మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాల్లో జమచేసేలా చట్టం తెస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మొత్తానికి సీఎం మాటలు కార్యరూపం దాల్చనున్నాయి. ఇందుకు సంబంధించిన కీలక బిల్లు సిద్ధమైంది. శనివారం శాసనసభలో తెలంగాణ ఉద్యోగుల జవాబుదారీతనం, పర్యవేక్షణ బిల్లు-2026ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
ఈ బిల్లుతో ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు పొందుతున్న ఉద్యోగులతో పాటు రాష్ట్రంలో ప్రైవేటుసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు.. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే తమ వేతనంలో నెలకు 15 శాతం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. జిల్లాల్లో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారుల(జిల్లా కలెక్టరు)కు కారణాలు వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే ఆ అధికారి పరిశీలించి దరఖాస్తును పరిష్కరిస్తారు. తరువాత ఉద్యోగి వేతనం నుంచి 15 శాతం లేదా రూ.10 వేలు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తల్లిదండ్రులకు భృతిగా అధికారి నిర్ణయిస్తారు.
భృతి పొందడం ఎలా..?
తమ పిల్లలు ప్రభుత్వ ఉద్యోగులై ఉండి నిరాదరణకు గురవుతున్న తల్లిదండ్రులకు ఈ బిల్లు ఒక వరం లాంటింది. నిరాదరణకు గురవుతున్న తల్లి లేదా తండ్రి అవసరమైతే ఇద్దరూ జిల్లా స్థాయిలో ప్రభుత్వం నియమించిన అధికారికి దరఖాస్తు సమర్పించాలి. ఈ దరఖాస్తును 60 రోజుల్లోగా పరిష్కరించి.. ఉద్యోగి జీతంలో నుంచి తల్లి లేదా తండ్రి ఖాతాలో 15 శాతం జమ అయ్యేలా చూడాలి. ఒక గడువులోగా సమస్య పరిష్కారం కాకపోతే.. రాష్ట్రస్థాయిలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ప్రధాన కమిషనర్‌గా వ్యవహరించే వయోవృద్ధుల కమిషన్‌లో అప్పీలు చేయవచ్చు. ఇందుకు 45 రోజుల గడువు ఉంటుంది. అప్పీలు అందిన 60 రోజుల్లోగా దరఖాస్తును కమిషన్ పరిష్కరించాలని నిబంధన చేర్చింది. తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోతే.. ఆ భృతిని మరొకరికి ఇవ్వాలి. ఇద్దరూ చనిపోతే సంబంధిత ఆధారాలతో ఉద్యోగి ప్రత్యేక అధికారి ముందు దరఖాస్తు చేయాలి. దాన్ని పరిశీలించి 30 రోజుల్లోగా తల్లిదండ్రులకు వేతనం జమ చేస్తూ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



