త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలోని పాడి రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు 'విజయ' పాలు సరఫరా చేయాలని నిర్ణయించింది.

J

Telangana | Published On Jun 20, 2026, 7.38 pm IST

Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు ‘విజయ’ పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి
Advertisement

Telangana Dairy Farmers | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని పాడి రైతులకు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకుంటున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా 'విజయ డెయిరీ' (Vijaya Dairy) పాలను సరఫరా చేయాలని రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పాడి రైతులను ఆదుకోవడంతో పాటు, విజయ డెయిరీని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ముందడుగు వేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సెక్రటేరియట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ మీటింగ్‌లో పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పాల డిమాండ్, సేకరణ విధానం, రైతులకు చెల్లించాల్సిన బకాయిలపై (Pending Bills) ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. పాల ఉత్పత్తులపై ఆధారపడిన వారి జీవితాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటను భట్టి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Telangana Govt to Supply Vijaya Milk to 27 Lakh Students Assures Dairy Farmers

పక్కా లెక్కలు.. ఆన్‌టైమ్ పేమెంట్లు

కొత్తగా 27 లక్షల మంది విద్యార్థులకు పాలు సరఫరా చేయాలంటే.. రాష్ట్రంలో ఖచ్చితమైన పాల ఉత్పత్తి వివరాలు తెలియాలి. అందుకే క్షేత్రస్థాయికి వెళ్లి పాలిచ్చే పశువుల సంఖ్యను, వాస్తవ ఉత్పత్తిని పక్కాగా లెక్కించి సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను భట్టి ఆదేశించారు. ముఖ్యంగా సంక్షేమ శాఖల ద్వారా నిధులను నేరుగా ఆయా విభాగాలకు బదిలీ చేసి, రైతులకు ఎలాంటి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు పేమెంట్లు (Payments) చేసేలా ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. రైతుల నుంచి సేకరించే పాల ధరపై స్పష్టమైన విధానం ఉండాలని అధికారులకు సూచించారు.

Telangana Govt to Supply Vijaya Milk to 27 Lakh Students Assures Dairy Farmers

లాభసాటిగా పాడి పరిశ్రమ

గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి పరిశ్రమే పట్టుగొమ్మ అని డిప్యూటీ సీఎం అన్నారు. సమయానికి డబ్బులు అందితే పాడి రైతుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని, డెయిరీపై నమ్మకంతో మరింత ఎక్కువగా పాలు పోస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ ద్వారా అదనపు జీవనోపాధి కల్పించేందుకు, ఉత్పత్తులను పెంచేందుకు మోడరన్ టెక్నాలజీని (Modern Technology) ఉపయోగించాలని సూచించారు.

Advertisement
Advertisement