CM Revanth Reddy | అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించండి.. కిషన్‌రెడ్డికి మరోసారి సీఎం రేవంత్ లేఖ
CM Revanth Reddy | హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరారు.
CM Revanth Reddy | హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో పెండింగ్‌లో ఉన్న కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 విస్తరణకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరిన ముఖ్యమంత్రి, ఈ అంశంపై 16న రాసిన తన గత లేఖను తాజా లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ఐఆర్‌ఎఫ్‌సీ (IRFC) నిధుల విడుదలలో నెలకొన్న పెండింగ్ అంశాల పరిష్కారం, అలాగే మెట్రో ఫేజ్–2 అమలుకు సంబంధించిన కీలక విషయాలను ఆయన ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో తాను న్యూఢిల్లీ పర్యటనలో ఉండనున్నట్లు ముఖ్యమంత్రి ఆ లేఖలో తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయడంలో చొరవ తీసుకోవాలని కిషన్ రెడ్డిని కోరారు. తాను స్వయంగా కేంద్ర మంత్రితో కలిసి ఈ అంశాలపై చర్చించాలనే అభిలాషను వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అత్యంత కీలకమైన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రితో జరిగే సమావేశంలో మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలను సమగ్రంగా వివరించి, ముందుకు సాగాల్సిన మార్గంపై నిర్మాణాత్మక చర్చ జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశానికి అవసరమైన సంబంధిత ఒప్పందాలు, పత్రాల ప్రతులను కూడా తాను వెంట తీసుకువస్తానని ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. సమావేశ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుని, వివరాలను వీలైనంత త్వరగా తెలియజేయాలని కిషన్ రెడ్డిని కోరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●OTT | 18 కోట్ల బడ్జెట్ - 70 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
- ●IND Vs AFG | అఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
- ●Balan Review | బాలన్ రివ్యూ - మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
- ●Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు 'విజయ' పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి
- ●Kayadu Lohar | సోషల్ మీడియాకు బ్రేక్ - నాని ప్యారడైజ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్
- ●Amit Shah | ఉగ్రవాదంపై మౌనం.. యూపీఏ పాలనపై అమిత్ షా విమర్శలు

OTT | 18 కోట్ల బడ్జెట్ - 70 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ

IND Vs AFG | అఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్

Balan Review | బాలన్ రివ్యూ - మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?

Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు 'విజయ' పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి




