Balan Review | బాలన్ రివ్యూ – మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
మంజుమ్మల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం దర్శకత్వం వహించిన లెటెస్ట్ మూవీ బాలన్ ది బాయ్ మలయాళంతో పాటు తెలుగులో రిలీజైంది. సర్వైవల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
Entertainment | Published On Jun 20, 2026, 8.33 pm IST
Balan Review | మలయాళం మూవీ మంజుమ్మల్ బాయ్స్ థియేటర్లలో 200 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాతోనే డైరెక్టర్‌గా చిదంబరం పేరు మారుమోగింది. మంజుమ్మల్ బాయ్స్ తర్వాత సర్వైవల్ థ్రిల్లర్ కథతో చిదంబరం తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ బాలన్ ది బాయ్. ఫర్జానా, అదిశేషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మలయాళం స్టార్ హీరో టోవినో థామస్ గెస్ట్‌గా నటించాడు. శుక్రవారం థియేటర్లలో తెలుగులో రిలీజైన ఈ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
ఖైదీ కథ...
ఓ మర్డర్ కేసులో జైలు శిక్షను అనుభవిస్తోన్నమహిళ (ఫర్జానా) జైలులోనే ఓ కొడుకుకు జన్మనిస్తుంది. శిక్ష కాలాన్ని పూర్తిచేసుకొని తన కొడుకుతో (ఆదిశేషన్) కలిసి విడుదలవుతుంది. తమ గతం గురించి ఎవరికి తెలియని చోట బతకాలని అనుకుంటుంది. రకరకాల జాబ్‌లు చేస్తుంది. ఒక్కో చోట ఒక్కో పేరు చెబుతుంది. తాను అబద్దాలు ఆడటమే కాకుండా కొడుకు చేత కూడా అబద్దాలు చెప్పిస్తుంది. దొంగ ఐడీ కార్డుతో ఓ వృద్దురాలి దగ్గర కేర్ టేకర్‌గా జాయిన్ అవుతుంది. అడవికి దగ్గరలో ఉన్న ఆ ఇంటిలో కేవలం వృద్ధురాలు మాత్రమే ఒంటరిగా ఉంటుంది. తన పేరు శెర్లీగా, కొడుకు పేరు వసుదేవన్‌గా పరిచయం చేసుకొని ఆ ముసలావిడకు దగ్గరవుతుంది. కష్టాలు తొలగిపోయాయని ఆనందంగా అనుకుంటున్న టైమ్‌లోనే శెర్లీని వెతుక్కుంటూ జైలుతో ఆమెతో పాటు ఉన్న ఖైదీ వస్తుంది. ఆమెను శెర్లీ హత్య చేస్తుంది. ఆ మర్డర్ కారణంగా కొడుకు వసుదేవన్‌కు దూరమవుతుంది. ఆ మర్డర్ కేసు నుంచి శెర్లీ ఎలా తప్పించుకుంది? తల్లికి దూరమైన వసుదేవన్ ఎమయ్యాడు? వసుదేవన్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అబ్బాస్‌కు ఉన్న సంబంధమేమిటి? వసుదేవన్‌పై పోలీస్ ఆఫీసర్ పవిత్రన్ పగతో రగిలిపోవడానికి కారణమేమిటి? కొడుకుకు ఇచ్చిన మాటను ఆ తల్లి ఎలా నిలబెట్టుకుంది? అన్నదే బాలన్ కథ.
సర్వైవల్ థ్రిల్లర్...
సర్వైవల్ థ్రిల్లర్‌గా దర్శకుడు చిదంబరం బాలన్ సినిమాను తెరకెక్కించారు. సమాజంలోని పలు అసమానతలను చర్చిస్తూ చివరి వరకు ఉత్కంఠగా ఈ మూవీ సాగుతుంది. రెగ్యులర్ థ్రిల్లర్ కోణంలో ఈ సినిమాను చూడలేము. మనిషి తన మనుగడ, ఉనికి కోసం సాగించే పోరాటంలో కొన్నిసార్లు నైతిక విలువలను కూడా పక్కనపెట్టాల్సివస్తుంది. అలాంటి సమయంలో వారు ఎదుర్కొనే సంఘర్షణ ఎలా ఉంటుందన్నది ఆలోచనాత్మకంగా చూపించారు. పేరు అన్నది చిన్న విషయంగానే కనిపిస్తుంది. మనిషి ఐడెంటీటీ మొత్తం ఆ పేరుపైనే ఉంటుందనే మెసేజ్ ఇచ్చారు.
తన పిల్లల కోసం తల్లి ఎంత దూరమైన వెళుతుంది? ఎలాంటి త్యాగాలకైనా సిద్ధపడుతుందన్నదన్నది ఆవిష్కరించారు. బ్రిటీషర్లతో స్వాతంత్య్రం కోసం పోరాడిన భారతీయులు...ఇప్పుడు ఉద్యోగాల పేరుతో మళ్లీ వాళ్ల కిందే ఎలా బానిసలుగా బతుకుతున్నారు అర్థవంతగా చూపించారు. చాలానే అంశాలు సినిమాలో టచ్ చేశారు.
బాల్యపు ఆనందాలు...
జైలు నుంచి తన కొడుకుతో హీరోయిన్ రిలీజయ్యే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఈ సారి మన కొత్త కథ ఏంటి...కొత్త పేరు ఏంటి అంటూ తల్లిని కొడుకు అడగటం... మారు పేర్లతో శెర్లీ ఉద్యోగాలు చేయడం లాంటి సన్నివేశాలతో ఈ సినిమా ముందుకు సాగుతుంది. శరీరానికి అయిన గాయాల కంటే మనసుకు అయిన గాయాల ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో తల్లీకొడుకుల పాత్రల ద్వారా ఎమోషనల్‌గా చూపించారు డైరెక్టర్. స్కూల్ గంట మోగగానే జైలు గంట గుర్తొచ్చి పిల్లాడు భయపడే సీన్ మనసులను కదిలిస్తుంది. పిల్లల జీవితంలో బాల్యం ఎంతో అందమైంది. కానీ కొన్ని సార్లు తల్లిదండ్రులు చేసే తప్పుల కారణంగా తమ బాల్యపు ఆనందాలను, స్వేచ్ఛను కోల్పోయిన పిల్లలు పడే వేదనను వసుదేవన్ పాత్ర ద్వారా హృద్యంగా చూపించారు డైరెక్టర్. క్లాస్ రూమ్‌లో పిల్లలంతా ఆనందంగా ఉన్నా తను మాత్రం భయపడుతూనే కనిపిస్తాడు.
ఇంటర్వెల్‌తో పాటు క్లైమాక్స్ ట్విస్ట్‌లు బాగున్నాయి. అయితే ఆర్ట్ సినిమా మాదిరిగా స్లో ఫేజ్‌లో సాగే స్క్రీన్‌ప్లే సినిమాకు బిగ్గెస్ట్ మైనస్‌గా మారింది. ప్రతి సీన్‌ను, ఎమోషన్‌ను డీటైలింగ్‌గా చూపించారు.
హావభావాలతో...
ఈ సినిమాకు ఫర్జానా, ఆదిశేషన్ యాక్టింగ్ హైలైట్‌గా నిలిచింది. సినిమా మొత్తం వీరి పాత్రల చుట్టే తిరుగుతుంది.
డైలాగ్స్‌తో కాకుండా హావభావాలతోనే ఇద్దరూ అదరగొట్టారు. మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ను క్రేజ్ కోసమే తీసుకున్నారు. పోలీస్ ఆఫీసర్‌గా పవిత్రన్, వృద్ధురాలిగా బీనా ఆంటోనీ నటన బాగుంది.
విజువల్స్ బాగున్నాయి. కేరళలోని ప్రకృతి అందాలను థ్రిల్లర్ కథతో ముడిపెట్టి చెప్పిన తీరు హైలైట్. బాలన్ కొత్త అనుభూతిని మిగిల్చే మలయాళ థ్రిల్లర్ మూవీ. చివరి వరకు చూడటానికి టన్నుల కొద్ది ఓపిక కావాలి.
తాజావార్తలు
- ●OTT | 18 కోట్ల బడ్జెట్ - 70 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
- ●IND Vs AFG | అఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్
- ●CM Revanth Reddy | అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించండి.. కిషన్‌రెడ్డికి మరోసారి సీఎం రేవంత్ లేఖ
- ●Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు 'విజయ' పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి
- ●Kayadu Lohar | సోషల్ మీడియాకు బ్రేక్ - నాని ప్యారడైజ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్
- ●Amit Shah | ఉగ్రవాదంపై మౌనం.. యూపీఏ పాలనపై అమిత్ షా విమర్శలు

OTT | 18 కోట్ల బడ్జెట్ - 70 కోట్ల కలెక్షన్స్ - ఓటీటీలోకి కోలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ

IND Vs AFG | అఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్‌స్వీప్

CM Revanth Reddy | అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేయించండి.. కిషన్‌రెడ్డికి మరోసారి సీఎం రేవంత్ లేఖ

Telangana Dairy Farmers | 27 లక్షల మంది విద్యార్థులకు 'విజయ' పాలు.. పాడి రైతులకు బకాయిల్లేని పేమెంట్లు: డిప్యూటీ సీఎం భట్టి



