Transgenders | కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు
Transgenders | రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు శుభవార్త. క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
Transgenders | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లకు శుభవార్త. క్యూర్ పరిధి వెలుపల ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్లలో కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్ జెండర్లను నియమించనున్నట్టు శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రతి కార్పోరేషన్‌లో ఒకరిని ఎంపిక చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ చట్టం-2019కి సవరణ కోరుతూ ఈ మేరకు ఆయన బిల్లు ప్రవేశపెట్టారు. సామాజికంగా వివక్ష ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్లను ప్రధాన స్రవంతిలో కి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి పలు కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.
అణగారిన వర్గాలు, సంచార జాతులతో పాటు సమాజంలో వెనుకబడిన ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి పాలనాపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం కల్పించడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల సమావేశాల్లో కో-ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్లు భాగస్వాములు అవ్వడం ద్వారా వారి సమస్యలను నేరుగా ప్రభుత్వ, అధికారుల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లభిస్తుంది అని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Kasipeta | మ్యుటేషన్ చేసేందుకు లంచం.. రిటైర్డ్ తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష
- ●Tapt Kund | బద్రీనాథ్‌లో విషాదం.. తప్త్ కుండ్‌లో స్నానమాచరిస్తూ అక్కాచెల్లెళ్లు మృతి
- ●Allu Arjun | అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ మూవీ కేరళలో లాంఛ్? - ఫ్యామిలీ మ్యాన్‌గా బన్నీ
- ●Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్ హస్తం ఉంది
- ●Vinesh Phogat | వినేశ్ ఫొగాట్‌కు ఎదురుదెబ్బ.. ట్రయల్స్‌కు హైకోర్టు నో!
- ●Suvendu Adhikari | కాళీమాత ఆలయంలో చేపల కూర తిన్న బెంగాల్ సీఎం

Kasipeta | మ్యుటేషన్ చేసేందుకు లంచం.. రిటైర్డ్ తహసీల్దార్‌కు రెండేళ్ల జైలు శిక్ష

Tapt Kund | బద్రీనాథ్‌లో విషాదం.. తప్త్ కుండ్‌లో స్నానమాచరిస్తూ అక్కాచెల్లెళ్లు మృతి

Allu Arjun | అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ మూవీ కేరళలో లాంఛ్? - ఫ్యామిలీ మ్యాన్‌గా బన్నీ

Harish Rao | 22ఏ వెనుక కచ్చితంగా రేవంత్ హస్తం ఉంది




