త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol | తెలంగాణ‌లో పెట్రోల్, డీజిల్ కొర‌త లేదు.. స్ప‌ష్టత‌నిచ్చిన కాంగ్రెస్ స‌ర్కార్

Petrol | తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొర‌త ఏర్ప‌డింద‌ని, బంకులు మూసివేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ సివిల్ స‌ప్ల‌యిస్ డిపార్ట్‌మెంట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

S

Telangana | Published On Mar 24, 2026, 6.05 pm IST

Petrol | తెలంగాణ‌లో పెట్రోల్, డీజిల్ కొర‌త లేదు.. స్ప‌ష్టత‌నిచ్చిన కాంగ్రెస్ స‌ర్కార్
Advertisement

Petrol | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొర‌త ఏర్ప‌డింద‌ని, బంకులు మూసివేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ సివిల్ స‌ప్ల‌యిస్ డిపార్ట్‌మెంట్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ విష‌యాన్ని ఎక్స్ వేదిక‌గా అధికారికంగా ప్ర‌క‌టించింది.

తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. త‌గినంత పెట్రోల్, డీజిల్ నిల్వ‌లు అందుబాటులో ఉన్నాయి. సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న ప్ర‌చారం న‌మ్మొద్దు అని వాహ‌న‌దారుల‌కు సివిల్ స‌ప్ల‌యిస్ డిపార్ట్‌మెంట్ సూచించింది. వాహ‌నాల్లో మాత్ర‌మే పెట్రోల్ పోయాల‌ని, వాట‌ర్ క్యాన్ల‌లో పోస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని బంకుల యాజ‌మాన్యాల‌ను అధికారులు హెచ్చ‌రించారు.

https://x.com/TGCivilSupplies/status/2036362365093159187

Advertisement

తాజావార్తలు

Advertisement