Gold And Silver Prices Today | నష్టాలకు బ్రేక్.. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత చోటు చేసుకుంది. సూచీలు అనిశ్చితితో కొనసాగుతున్నాయి. అయితే గత నాలుగైదు సెషన్ల నుంచి భారీగా పతనమైన బంగారం ధరలకు మంగళవారం బ్రేక్ పడింది. ఈ సెషన్‌లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర అస్థిరత చోటు చేసుకుంది. సూచీలు అనిశ్చితితో కొనసాగుతున్నాయి. అయితే గత నాలుగైదు సెషన్ల నుంచి భారీగా పతనమైన బంగారం ధరలకు మంగళవారం బ్రేక్ పడింది. ఈ సెషన్‌లో పసిడి ధర స్వల్పంగా పెరిగింది. అయితే వెండి ధరలు మాత్రం భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ఈ లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర ఈ సెషన్‌లో 0.47 శాతం మేర తగ్గి 4,426 డాలర్లకు చేరగా, వెండి ధర 0.38 శాతం మేర తగ్గి 66 డాలర్లకు చేరుకుంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 342 పాయింట్లు తగ్గి 1,54,118 వద్దకు చేరగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 551 పాయింట్లు తగ్గి 2,39,725 వద్ద నిలిచింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరగ్గా, వెండి ధరలు తగ్గాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,693 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,25, 544 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,56,930 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,69,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.1,600 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,385 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,15,080గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,43,850 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,38,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,500 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,770 ఉండగా, 8 గ్రాముల ధర రూ.94,160గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,17,700 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,77,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.1,200 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,55,000 ఉండగా, తులం ధర రూ.2,550 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.12వేలు పెరిగిన బంగారం ధర.. మార్కెట్లలో తీవ్ర అనిశ్చితి..
సెప్టెంబర్ 10, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.10వేలు తగ్గిన బంగారం ధర.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
సెప్టెంబర్ 9, 2026

Gold And Silver Prices Today | భారీగా పెరిగిన బంగారం ధరలు.. బులియన్ మార్కెట్లలో మళ్లీ జోష్..
సెప్టెంబర్ 8, 2026
తాజావార్తలు
- ●NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన
- ●US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..
- ●MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి
- ●Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం
- ●Nitin Gadkari | సిగ్గుగా ఉంది.. ప్రారంభోత్సవానికి నేను రాను : రహదారి నిర్మాణం ఆలస్యంపై గడ్కరీ అసహనం
- ●S.Madhusudhana Chary | పింక్ కలర్ చొక్కా వేసుకున్నా సభలో అడ్డుకున్నరు

NRI BRS Australia | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై ఆస్ట్రేలియాలో నిరసన

US Dollar | అమెరికా డాలర్ తన ప్రాభవాన్ని కోల్పోతుందా..? సింగపూర్ డాలర్ వైపు ఇన్వెస్టర్ల చూపులు..

MLC L Ramana | అసెంబ్లీ సమావేశాలు కనీసం నెల రోజుల పాటు నిర్వహించండి

Bhatti Vikramarka | ఉద్యోగులందరికీ రూ.కోటి బీమా పథకం అమలు చేస్తున్నం



