Indian Post GDS Recruitment | పదో తరగతి పాసైతే చాలు.. పోస్టాఫీసులో ఉద్యోగాలు.. రేపట్నుంచే దరఖాస్తుల స్వీకరణ
Indian Post GDS Recruitment | త్రినేత్ర.న్యూస్ : మీరు పదో తరగతి పాసయ్యారా..? ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ సువర్ణావకాశం మీ కోసమే. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా పోస్టల్ శాఖ ఉద్యోగాలు ఇస్తున్నది.
Indian Post GDS Recruitment | త్రినేత్ర.న్యూస్ : మీరు పదో తరగతి పాసయ్యారా..? ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ సువర్ణావకాశం మీ కోసమే. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా పోస్టల్ శాఖ ఉద్యోగాలు ఇస్తున్నది. దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో గ్రామీణ డాక్ సేవ (GDS) పోస్టులను భర్తీ చేస్తున్నది. మొత్తం 23,757 పోస్టులకు నోటిఫికేషన్ (GDS Recruitment ) విడుదల చేసింది. తెలంగాణ సర్కిల్‌లో 419, ఆంధ్రప్రదేశ్‌లో 918 పోస్టులు ఉన్నాయి.
పోస్టుపేరు: బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్
పోస్టుల సంఖ్య: 23,757
జనరల్ 10,640, ఓబీసీ 4,433, ఎస్సీ 3,082, ఎస్టీ 2,773, ఈడబ్ల్యూఎస్ 2,160 చొప్పున ఉన్నాయి.
తెలంగాణలో 419, ఆంధ్రప్రదేశ్‌లో 918 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలై కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. అభ్యర్థులకు మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో పాటు స్థానిక భాష తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కడం తెలిసి ఉండాలి. 2026 సెప్టెంబర్ 21 నాటికి అభ్యర్థులు 18 నుంచి 40 ఏండ్ల వయస్కులై ఉండాలి.
జీతాలు ఇలా..
బ్రాంచ్ మాస్టర్ పోస్టులకు రూ.12,000 నుంచి రూ.29,380 వరకు, మిగిలిన పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు ప్రతి నెల వేతనం వస్తుంది.
ఎంపిక విధానం
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం) పోస్టులను రాత పరీక్ష లేకుండానే భర్తీ చేస్తారు. నియామక ప్రక్రియలో పదో తరగతిలో సాధించిన మార్కులను పరిగణంలోకి తీసుకుని ప్రాధాన్యమిస్తారు. రోజువారీ విధులు నిర్వహించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్ ఫోన్ లాంటివి తపాలా శాఖ అందిస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలనే నిబంధన ఉంది.
ఎంపికైన అభ్యర్థులు 15 రోజుల్లోగా హాజరుకావాలి. అర్హత ధ్రువీకరణ సర్టిఫికెట్లను సమర్పించాలి. డివిజన్ లేదా యూనిట్ డివిజనల్ లేదా యూనిట్ హెడ్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలి.
దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో మాత్రమే
దరఖాస్తు ఫీజు: రూ.100 కాగా, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మినహాయింపు కల్పించారు.
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 2
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 21
వెబ్‌సైట్: indiapost.gov.in
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్



