Uttam Kumar Reddy | ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి.. మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి ఆదేశం
Uttam Kumar Reddy | రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Uttam Kumar Reddy | రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ఆయన, కొనుగోళ్లలో ఎలాంటి జాప్యం లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో పాటు ఖమ్మం జిల్లా నుంచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, అడ్డూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, ఇతర జిల్లాల అధికారులు, కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా సమీక్షలో భాగమయ్యారు.
ఈ మంత్రి ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్‌లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సాగు జరిగింది. ఇందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని, ఇందుకు గాను రూ.8,749 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు 21 కోట్ల గోనె సంచులను అందుబాటులో ఉంచినట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న 8.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ నెలాఖరులోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
సరిహద్దు జిల్లాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం, జొన్నలు, మొక్కజొన్నలు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే రైస్ మిల్లర్లు, దళారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కొనుగోలు వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేసి రైతులకు చెల్లింపులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. కొనుగోళ్లపై వచ్చే తప్పుడు వార్తలను ఖండించాలని, ప్రభుత్వ స్థాయిలో జరుగుతున్న రికార్డు కొనుగోళ్లను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

CP Sajjanar | బక్రీద్ వేళ నకిలీ యాప్‌లతో మోసాలు.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్
మే 26, 2026

MLA Rajagopal Reddy | రైతన్నలూ.. క్షమించండి.. పది రోజుల్లో మొత్తం ధాన్యం కొంటాం: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
మే 26, 2026

Harbeer Singh | డ్రగ్స్ రాకెట్లో పంజాబీ సింగర్.. హర్బీర్ సింగ్ సోహైల్‌ను అరెస్టు చేసిన పోలీసులు..!
మే 26, 2026
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



