త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MLA Rajagopal Reddy | రైతన్న‌లూ.. క్ష‌మించండి.. ప‌ది రోజుల్లో మొత్తం ధాన్యం కొంటాం: ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి

MLA Rajagopal Reddy | ధాన్యం కొనుగోళ్లు ఆల‌స్య‌మైన మాట వాస్త‌వ‌మేన‌ని, రైత‌న్న‌లు క్ష‌మించాల‌ని మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి అన్నారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌తిప‌క్షాలు పోషించిన పాత్ర‌ను తాము పాజిటివ్ గా తీసుకుంటామ‌న్నారు.

S

Telangana | Published On May 26, 2026, 12.08 pm IST

MLA Rajagopal Reddy | రైతన్న‌లూ.. క్ష‌మించండి.. ప‌ది రోజుల్లో మొత్తం ధాన్యం కొంటాం: ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి
Advertisement
  • ధాన్యం కొన‌డం ఆల‌స్య‌మైంది నిజ‌మే
  • క‌ల్లాల్లో మీరు ఇబ్బంది ప‌డుతున్న‌దీ వాస్త‌వ‌మే
  • ఎక్కువ దిగుబ‌డి రావ‌డం వ‌ల్లే ఈ స‌మ‌స్య వ‌చ్చింది
  • ప్ర‌భుత్వం త‌ర‌ఫున మీకు క్ష‌మాప‌ణ చెబుతున్నా
  • ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌తిప‌క్షాల పాత్రను పాజిటివ్‌గానే తీసుకుంటాం
  • అంకిరెడ్డిగూడెంలో మీడియాతో ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి వ్యాఖ్య‌లు

MLA Rajagopal Reddy | త్రినేత్ర‌.న్యూస్: ధాన్యం కొనుగోళ్లు ఆల‌స్య‌మైన మాట వాస్త‌వ‌మేన‌ని, రైత‌న్న‌లు క్ష‌మించాల‌ని మునుగోడు ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి అన్నారు. ప్ర‌జ‌లు, ప్ర‌తిప‌క్షాలు స‌హ‌క‌రిస్తే మ‌రో ప‌ది రోజుల్లో క‌ల్లాల్లో ఉన్న‌ ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేస్తామ‌ని చెప్పారు. చౌటుప్ప‌ల్ మండలంలోని అంకిరెడ్డిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఆయ‌న మంగ‌ళ‌వారం ప‌రిశీలించి రైతుల బాధ‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున ప్ర‌తిప‌క్షాలు పోషించిన పాత్ర‌ను తాము పాజిటివ్ గా తీసుకుంటామ‌న్నారు. రైతుల విష‌యంలో రాజ‌కీయాలు చేయ‌ద‌ల‌చుకోలేద‌ని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఆల‌స్య‌మైన మాట నిజం. ప్ర‌భుత్వం త‌ర‌ఫున క్ష‌మాప‌ణ చెబుతున్నా. మ‌నం అనుకున్న‌దానికంటే మూడు రెట్లు ధాన్యం ఎక్కువ‌గా దిగుబ‌డి వ‌చ్చింది. క‌ల్లాల‌ల్ల రైతులు ఇబ్బంది ప‌డుతున్న‌ది నిజ‌మే. గత 15 రోజుల నుంచి ప‌డిగాపులు కాస్తున్న‌ది వాస్త‌వ‌మే. మేం కూడా బాధ‌ప‌డుతున్నాం. మా ప్ర‌భుత్వం రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి ప్ర‌జ‌ల కోస‌మే ప‌ని చేస్తుంది. అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

నేను కూడా మాటిస్తున్నాం..

నేను కూడా మీకు మాటిస్తున్నా. రాబోయే ప‌ది రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తం. అధికారుల‌తో నిరంత‌రం మాట్లాడుతున్నాం. ధాన్యం నిల్వ కోసం ఇంకో ల‌క్ష ట‌న్నుల సామ‌ర్థ్యం ఉన్న గోదాం సూర్యాపేట జిల్లా తిరుమ‌ల‌గిరిలో ఇంకోటి ఉంది. ఎన్న‌డూ ఇంత స‌మ‌స్య రాలేదు. ఈసారి మాత్ర‌మే ఇలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయి. దిగుబ‌డి ఎక్కువ రావ‌డం, వివిధ కార‌ణాల వ‌ల్ల ధాన్యం కొనుగోళ్లు ఆల‌స్య‌మ‌య్యాయి. రైతులంద‌రూ ప‌రిస్థితిని అర్థం చేసుకొని స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నా అని ఆయ‌న అన్నారు.

రైతుల విష‌యంలో రాజ‌కీయం చేయం..

ప్రతిప‌క్ష పార్టీల‌కు కూడా తెలియ‌జేస్తున్నాం. ధాన్యం కొన‌డం ఆల‌స్య‌మైంది వాస్త‌వ‌మే. మీరు కూడా ప్ర‌జ‌ల ప‌క్షాన మీ పాత్ర పోషించారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున మీరు చేసిన పోరాటాన్ని మేం పాజిటివ్‌గానే తీసుకుంటాం. దాన్ని రాజ‌కీయం చేయ‌ద‌ల‌చుకోలేదు. ఎందుకంటే ఇది రైతుల స‌మ‌స్య‌. రైతులను ఆదుకొని వారికి అండ‌గా ఉండాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌తిప‌క్షాల‌పై కూడా ఉంది. అంద‌రూ స‌హ‌క‌రిస్తే మ‌రో ప‌ది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తాం అని ఎమ్మెల్యే రాజ‌గోపాల్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Advertisement
Advertisement