Harbeer Singh | డ్రగ్స్ రాకెట్‌లో పంజాబీ సింగర్.. హర్బీర్ సింగ్ సోహైల్‌ను అరెస్టు చేసిన పోలీసులు..!
Harbeer Singh | పంజాబ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ గాయకుడు హర్బీర్ సింగ్ సోహల్ కారులో డ్రగ్స్ కనిపించాయి. 5.1 కిలోల హెరాయిన్‌తో పాటు రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకొని సింగర్‌ను అరెస్టు చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా రాకెట్‌లో ‘క్యారియర్’గా పనిచేస్తున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.
Harbeer Singh | పంజాబ్‌లో సంచలన ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ గాయకుడు హర్బీర్ సింగ్ సోహల్ కారులో డ్రగ్స్ కనిపించాయి. 5.1 కిలోల హెరాయిన్‌తో పాటు రూ.1.50 లక్షల నగదు స్వాధీనం చేసుకొని సింగర్‌ను అరెస్టు చేశారు. అంతర్జాతీయ డ్రగ్స్ సరఫరా రాకెట్‌లో ‘క్యారియర్’గా పనిచేస్తున్నాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఖన్నా ఎస్‌ఎస్‌పీ దర్పన్ అహ్లావాలియా తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్ట్రేలియా, కెనడా కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్లతో కలిసి ఈ ముఠా పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తోంది. ఈ నెట్‌వర్క్‌లో భాగంగానే సోహల్ పనిచేస్తున్నాడని దర్యాప్తులో తేలినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో మార్చి 7న లూధియానాలోని దోరాహా పోలీసులు అక్షయ్ కుమార్ అనే యువకుడిని 301 గ్రాముల హెరాయిన్‌తో అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా మరింత సమాచారం బయటపడింది. తదనంతరం 268 గ్రాముల హెరాయిన్, 10 గ్రాముల ఐస్ డ్రగ్, 30 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, నగదు, ఒక కారు కూడా స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో అక్షయ్ కుమార్, విశాల్, సంజీవ్ కుమార్ అలియాస్ సన్నీ కలిసి డ్రగ్స్ సరఫరాలో పాల్గొన్నట్లు వెల్లడైంది. ఇందులో విశాల్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, సంజీవ్‌ను మే 20న పట్టుకున్నారు. సంజీవ్ విచారణలో రోపర్ జైలులో జతిందర్ సింగ్ అలియాస్ గోల్డీని కలిసినట్లు తేలింది. అనంతరం గోల్డీతో కలిసి డ్రగ్స్ వ్యాపారం కొనసాగించినట్లు సమాచారం. గోల్డీ ప్రస్తుతం కెనడాలో ఉండగా.. అతని సహచరుడు గుర్జంత్ సింగ్ అలియాస్ జట్టా ఆస్ట్రేలియాలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురినీ కేసులో నిందితులుగా చేర్చారు. తదుపరి దర్యాప్తులో భాగంగా హర్బీర్ సింగ్ సోహల్‌ను అరెస్ట్ చేయగా, అతని థార్ వాహనంలో ఉన్న బ్యాగ్‌లో 5.1 కిలోల హెరాయిన్‌తో పాటు రూ.1.50 లక్షల డ్రగ్ మనీని స్వాధీనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ రవాణా నెట్‌వర్క్‌లో అతను కీలక ‘క్యారియర్’గా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఎన్డీపీఎస్ యాక్ట్‌తో పాటు ఆయుధాల చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హర్బీర్ సింగ్ సోహల్ ‘7 దిన్’, ‘పిట్టల్’, ‘మాబ్‌స్టర్’, ‘కలామాల్’ వంటి పాటలతో గుర్తింపు పొందారు. డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు






