Smart Meter | కరెంటు మీటర్లు మార్చుకోవాల్సిందేనా?
Smart Meter | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తున్నది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లను (Smart Meter) ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం (Congress Govt) సిద్ధమవుతున్నది.
Smart Meter | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం కనిపిస్తున్నది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్మార్ట్ మీటర్లను (Smart Meter) ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం (Congress Govt) సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఇకపై కొత్తగా ఇచ్చే విద్యుత్ కనెక్షన్లకు తప్పనిసరిగా స్మార్ట్ మీటర్లనే అమర్చనున్నారు. ప్రస్తుతం ఉన్న పాత మీటర్ల స్థానంలో దశలవారీగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను (Prepaid Smart Meter) అమర్చడం తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీంతో ప్రతినెల వినియోగదారుల ఇండ్లకు వెళ్లి కరెంటు బిల్లు ఇవ్వాల్సిన భారం విద్యుత్ సంస్థలకు తప్పనుంది.
సాధారణ మీటర్ల కంటే స్మార్ట్ మీటర్లు అధునాతనమైనవి. ఇవి రియల్ టైమ్‌లో విద్యుత్ వినియోగాన్ని రికార్డు చేసి మొబైల్ యాప్ (Mobile App) లేదా ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా వినియోగదారునికి సమాచారం అందిస్తాయి. ప్రీ పెయిడ్ విధానంలో పనిచేసే ఈ మీటర్లు మొబైల్ రీచార్జ్‌లాగా పనిచేస్తాయి. బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత చార్జ్ చేయకపోతే విద్యుత్ సరఫరా ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది బిల్లింగ్ కచ్చితత్వాన్ని పెంచి, అంచనా బిల్లులను తొలగించి విద్యుత్ చోరీని అరికట్టడంలో సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు.

భారం.. వినియోగదారులపైనే?
అయితే సాధారణ మీటర్ల కంటే స్మార్ట్ మీటర్ల ధర చాలా ఎక్కువ. ఈ స్మార్ట్ మీటర్ల తయారీ, ఏర్పాటుకు అయ్యే మొత్తం ఖర్చును వినియోగదారుల నుంచే వసూలు చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (DISCOM) భావిస్తున్నాయి. కాబట్టి వారిపై భారం పడినట్లు ఏర్పడనీయకుండా వాయిదాల పద్ధతిలో బిల్లులోనే ఈ మీటర్‌కు సంబంధించిన చార్జీలను రుద్దే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే ఒక్కో మీటరు ఖరీదు ఎంత అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఇప్పటికే హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్టుగా సుమారు 12 వేల స్మార్ట్ మీటర్లను విద్యుత్ అధికారులు అమర్చారు. ఈ అనుభవం ఆధారంగా ఇదే విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా విద్యుత్ కనెక్షన్ తీసుకునే (Electricity Connections) వినియోగదారులకు ఇకపై స్మార్ట్ మీటర్లే ఇవనున్నారు. ఆ తర్వాత దశలవారీగా కార్యాలయాలు, వ్యాపారవాణిజ్య సంస్థలు, అధిక వినియోగం ఉన్న గృహాలకు అమర్చనున్నట్లు తెలిపారు. అయితే ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ప్రవేశపెట్టే ఈ కొత్త విధానానికి అయ్యే ఆర్థిక భారాన్ని సామాన్య వినియోగదారులు ఎందుకు భరించాలి? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Oxford | తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టండి.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
ఆగస్టు 21, 2026

Governor Shiv Pratap Shukla | విశ్వసనీయ వార్తలతోనే ప్రజాస్వామ్యం బలోపేతం : గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
ఆగస్టు 21, 2026

Dasoju Sravan | ఆదిలాబాద్ సీసీఐని అదానీకి కట్టబెట్టే కుట్ర: దాసోజు శ్రవణ్
ఆగస్టు 21, 2026
తాజావార్తలు
- ●Madhur Knit Crafts | రూ.53.28 కోట్లతో మధుర్ నిట్ క్రాఫ్ట్స్ ఐపీఓ.. వివరాలు ఇవే..
- ●Indian national arrested in US | వృద్ధులే లక్ష్యంగా రూ.63 కోట్ల భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్
- ●Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..
- ●Bandla Ganesh | కుదిరితే బీఆర్ఎస్..లేదంటే జనసేన.. వచ్చే ఎన్నిల్లో పోటీకి సిద్ధమవుతున్న బండ్ల గణేశ్
- ●Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి
- ●RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

Madhur Knit Crafts | రూ.53.28 కోట్లతో మధుర్ నిట్ క్రాఫ్ట్స్ ఐపీఓ.. వివరాలు ఇవే..

Indian national arrested in US | వృద్ధులే లక్ష్యంగా రూ.63 కోట్ల భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్

Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..

Bandla Ganesh | కుదిరితే బీఆర్ఎస్..లేదంటే జనసేన.. వచ్చే ఎన్నిల్లో పోటీకి సిద్ధమవుతున్న బండ్ల గణేశ్



