Oxford | తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టండి.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
Oxford | తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంలో భాగంగా శుక్రవారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన ఆయన.. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే అంశంపై అక్కడి విద్యావేత్తలతో చర్చించారు.
Oxford | తెలంగాణలో విద్యా, పరిశోధన రంగాల్లో విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంలో భాగంగా శుక్రవారం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించిన ఆయన.. రాష్ట్ర యువతకు అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించే అంశంపై అక్కడి విద్యావేత్తలతో చర్చించారు. సుమారు 900 ఏళ్ల చరిత్ర ఉన్న ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీ ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ దార్శనికతను వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రణాళికలను వారికి వివరించారు.
హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటు చేయండి
ఆక్స్‌ఫర్డ్ వర్సిటీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్, పరిశోధన కార్యక్రమాలను హైదరాబాద్‌కు విస్తరించాలని సీఎం కోరారు. నగరంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ప్రొఫెసర్లు మాయా ట్యూడర్, ఫైసల్ దేవ్జీ సానుకూలంగా స్పందించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలను వారు ప్రస్తావించారు. ఈ సమావేశంలో సీఎం కార్యాలయ సలహాదారు, ఎక్స్‌అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. జాతీయ విద్యా విధానం నేపథ్యంలో విదేశీ విశ్వవిద్యాలయాలకు ఉన్న అవకాశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, తెలంగాణలో విదేశీ వర్సిటీలు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న సౌకర్యాలు, ప్రయోజనాలను వివరించారు.
గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రతినిధి బృందాన్ని పంపాలని తెలంగాణ బృందం ఆహ్వానించింది. అనంతరం రేవంత్‌రెడ్డి చారిత్రక సోమర్‌విల్ కాలేజీని సందర్శించారు. అక్కడ విద్యాభ్యాసం చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిత్రపటాన్ని పరిశీలించారు. 2002లో సోనియాగాంధీ ఈ చిత్రపటాన్ని కాలేజీకి బహూకరించారు. జీఎంఆర్ గ్రూప్ నిర్వహిస్తున్న యుటిలిటా బౌల్‌ను కూడా సీఎం సందర్శించారు. సంస్థ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంథితో కలిసి అక్కడి క్రీడా సదుపాయాలను పరిశీలించారు. గోల్ఫ్ కోర్స్‌తో పాటు వివిధ క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు, హోటల్‌ను ఆయన చూశారు. తెలంగాణలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధిపై జీఎంఆర్ ప్రతినిధులు, గ్లోబల్ స్పోర్ట్స్ యూనిట్‌తో చర్చించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి క్రీడా రంగ అభివృద్ధికి భాగస్వాములు కావాలని సీఎం ఆహ్వానించారు. శుక్రవారం సాయంత్రం ప్రీమియర్ లీగ్ చాంపియన్ ఆర్సెనల్, కోవెంట్రీ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ను వీక్షించేందుకు సీఎం ఎమిరేట్స్ స్టేడియాన్ని సందర్శించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●"ఎవరొచ్చినా ఆపేదే లేదు!" – వరంగల్‌లో కొండా ఫ్యామిలీ 'డబుల్ గేమ్' వెనుక అసలు స్కెచ్ ఇదే!
- ●Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్లకు ప్రాథమిక అర్హుల జాబితా విడుదల.. ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి
- ●Sugar Price Hike | చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ కారణం కాదు.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం..!
- ●Tirumala | శేషాచలం అడవుల్లో ‘రోబో డాగ్’ నిఘా.. భక్తుల భద్రతకు టీటీడీ సరికొత్త అడుగు..
- ●Jonita Gandhi | టాలీవుడ్ హీరోయిన్ తమ్ముడితో సింగర్ జోనితా గాంధీ డేటింగ్
- ●Rayadurg | రాయదుర్గం భూమికి భారీ ధర.. రికార్డు స్థాయిలో ఎకరా రూ.264 కోట్లు

"ఎవరొచ్చినా ఆపేదే లేదు!" – వరంగల్‌లో కొండా ఫ్యామిలీ 'డబుల్ గేమ్' వెనుక అసలు స్కెచ్ ఇదే!

Indiramma Illu | ఇందిరమ్మ ఇళ్లకు ప్రాథమిక అర్హుల జాబితా విడుదల.. ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి

Sugar Price Hike | చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ కారణం కాదు.. స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం..!

Tirumala | శేషాచలం అడవుల్లో ‘రోబో డాగ్’ నిఘా.. భక్తుల భద్రతకు టీటీడీ సరికొత్త అడుగు..




