Madhur Knit Crafts | రూ.53.28 కోట్లతో మధుర్ నిట్ క్రాఫ్ట్స్ ఐపీఓ.. వివరాలు ఇవే..
Madhur Knit Crafts | వస్త్ర తయారీ సంస్థ మధుర్ నిట్ క్రాఫ్ట్స్ రూ.53.28 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను ఆగస్టు 24న ప్రారంభించనుంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణాల చెల్లింపు, సౌర విద్యుత్ ప్యానెళ్ల కొనుగోలు కోసం నిధులు సమీకరించేందుకు కంపెనీ ఈ ఐపీఓకు వస్తోంది. ఈ ఐపీఓ ఆగస్టు 27న పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌కు ముగియనుంది.
Madhur Knit Crafts | వస్త్ర తయారీ సంస్థ మధుర్ నిట్ క్రాఫ్ట్స్ రూ.53.28 కోట్ల ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌ను ఆగస్టు 24న ప్రారంభించనుంది. వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, రుణాల చెల్లింపు, సౌర విద్యుత్ ప్యానెళ్ల కొనుగోలు కోసం నిధులు సమీకరించేందుకు కంపెనీ ఈ ఐపీఓకు వస్తోంది. ఈ ఐపీఓ ఆగస్టు 27న పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్‌కు ముగియనుంది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ.95 నుంచి రూ.100గా కంపెనీ నిర్ణయించింది. షేర్లను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎమర్జ్ ప్లాట్‌ఫామ్‌లో లిస్ట్ చేయాలని ప్రతిపాదించింది. ఈ పబ్లిక్ ఆఫర్ పూర్తిగా కొత్తగా జారీ చేసే 53.28 లక్షల ఈక్విటీ షేర్లతో ఉంటుంది. దరఖాస్తు లాట్ పరిమాణాన్ని 1,200 షేర్లుగా నిర్ణయించారు. మార్కెట్ మేకర్ల కోసం 2.66 లక్షల షేర్లను కేటాయించారు. ఐపీఓ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.20.85 కోట్లను కొన్ని బకాయి రుణాలను ముందస్తుగా చెల్లించడానికి లేదా తిరిగి చెల్లించడానికి ఉపయోగించనుంది. మరో రూ.15.92 కోట్లను వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు వినియోగించనుంది.
పెరిగిన లాభాలు..
సౌర ప్యానెళ్ల కొనుగోలుకు రూ.3.68 కోట్లను కేటాయించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలు, ఐపీఓకు సంబంధించిన ఖర్చుల కోసం వినియోగించనుంది. ప్రతిపాదిత ఐపీఓ తమ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని మధుర్ నిట్ క్రాఫ్ట్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ గుప్తా తెలిపారు. ఇది వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడంతోపాటు ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుందని అన్నారు. తయారీ సామర్థ్యాల్లో మరింత పెట్టుబడులు పెట్టేందుకు సహాయపడుతుందని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగిసిన 11 నెలల కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.194.79 కోట్లుగా నమోదైంది. ఇదే కాలంలో పన్నుల అనంతర లాభం రూ.12.35 కోట్లుగా ఉంది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.171.76 కోట్లు కాగా, పన్నుల అనంతర లాభం రూ.11.03 కోట్లుగా నమోదైంది.
కంపెనీ ఏం చేస్తుంది..
1997లో స్థాపించిన మధుర్ నిట్ క్రాఫ్ట్స్ వివిధ రకాల వస్త్రాలు, దుప్పట్లు, శీతాకాలపు వస్త్రాలు, దుస్తులు, ఇతర టెక్స్‌టైల్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. యార్న్ నుంచి క్లాత్ వరకు సమగ్ర తయారీ విధానాన్ని కంపెనీ నిర్వహిస్తోంది. కంపెనీ తయారీ సామర్థ్యాల్లో నిట్టింగ్, డైయింగ్, ప్రింటింగ్, బ్రషింగ్, పాలిషింగ్, సూయిడింగ్, స్టెంటరింగ్, బాండింగ్, ఫినిషింగ్ వంటి ప్రక్రియలు ఉన్నాయి. దుస్తులు, గృహ వస్త్రాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేస్తోంది. ఈ ఐపీఓకు ఎస్కేఐ క్యాపిటల్ సర్వీసెస్ ఏకైక బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది.
తాజావార్తలు
- ●Indian national arrested in US | వృద్ధులే లక్ష్యంగా రూ.63 కోట్ల భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్
- ●Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..
- ●Bandla Ganesh | కుదిరితే బీఆర్ఎస్..లేదంటే జనసేన.. వచ్చే ఎన్నిల్లో పోటీకి సిద్ధమవుతున్న బండ్ల గణేశ్
- ●Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి
- ●RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- ●Diwali Day | నవంబర్ 8న దీపావళి దినోత్సవం.. తీర్మానానికి కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం

Indian national arrested in US | వృద్ధులే లక్ష్యంగా రూ.63 కోట్ల భారీ మోసం.. అమెరికాలో భారతీయుడి అరెస్ట్

Google | గూగుల్‌లో అదిరిపోయే మార్పులు.. యూజర్లు ఇక ఇష్టమైన న్యూస్‌నే చదవొచ్చు..

Bandla Ganesh | కుదిరితే బీఆర్ఎస్..లేదంటే జనసేన.. వచ్చే ఎన్నిల్లో పోటీకి సిద్ధమవుతున్న బండ్ల గణేశ్

Murali Akunuri | రాహుల్ గాంధీ.. ఏడాదికి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైంది?: ఆకునూరి మురళి






