RS Praveen Kumar | సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు అనుమతించని కేంద్రం.. నిజాలు నిగ్గు తేల్చాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటనకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరిడచానికి వెనుకున్న నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) డిమాండ్ చేశారు.
RS Praveen Kumar | త్రినేత్ర.న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా పర్యటనకు భారత ప్రభుత్వం అనుమతి నిరాకరిడచానికి వెనుకున్న నిజాలను నిగ్గు తేల్చాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) డిమాండ్ చేశారు. లండన్‌కు పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం, అమెరికాలో సీఎం రేవంత్ బృందంలో అందరికీ పర్మిషన్ ఇచ్చి కేవలం ముఖ్యమంత్రికే ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. `ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు’ అమెరికా టూర్ షెడ్యూల్‌లో ఉన్నందుకే అనుమతి నిరాకరించాం అని విదేశాంగ వ్యవహారాల (MEA) అధికార ప్రతినిధి అంటున్నారు. అంటే సీఎం రేవంత్ అమెరికాలో అనధికారికంగా దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఏమైనా చేయబోతున్నారన్న విషయం భారత గూఢచార సంస్థలు ముందుగానే పసిగట్టాయా? అని అనుమానం వ్యక్తం చేశారు.
ఆయన గతంలో సీఎం హోదాలో హార్వర్డ్‌లో దాదాపు రూ.కోటి వెచ్చించి ఒక వారం చదువుకున్నారు. అప్పుడు ఆయనతో పాటు ఫయీం ఖురేషీ, రోహన్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు మరి కొందరు ఉన్నట్లుగా ఫోటోలు విడుదలయ్యాయి. వీళ్లు ఒక ప్రైవేటు విమానంలో ప్రయాణించినట్లు ఫోటోలు విడుదల అయ్యాయి!?. అంటే వీళ్లందరూ గతంలో ఏమైనా చేయరాని (Inappropriate) తప్పులు చేశారని భారత్ గూఢచార వర్గాలు, అంతరంగిక సంస్థలు గోప్యంగా వివరాలు సేకరించాయా? లేక ఓవర్సీస్ కాంగ్రేస్ పేరుతో ‘షెల్’ (ముసుగు) కంపెనీల సమావేశంలో పాల్గొన్నారా? వీళ్లందరూ ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరిని కలిశారు అన్న విషయాలు భారత గూఢచార వర్గాలు సేకరించారా? దీని వల్ల దేశ భద్రతకు సార్వభౌమాధికారానికి ఏమైనా ముప్పు పొంచి ఉందని భారత ప్రభుత్వం భావించిందా? అని ప్రశ్నించారు.
నిజానికి సీఎం రేవంత్ టూర్ షెడ్యూల్‌లో చెప్పినట్లుగా విద్యాపరమైన ఒప్పందాల వరకే అమెరికా బోస్టన్ నగరానికి పోతుంటే దానికి అనుమతి నిరాకరణ అన్యాయం. ఈ విషయంలో అన్యాయం జరిగి ఉంటే పార్టీలకు అతీతంగా అందరం ప్రభుత్వానికి సపోర్ట్ చేయాల్సిందే. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. రాష్ట్రాల స్వయంప్రతిపత్తికి సంబంధించిన విషయం.
ఇప్పుడు కూడా సీఎం అమెరికా షెడ్యూల్‌లో ఓవర్సీస్ కాంగ్రెస్ (Overseas Congress) సమావేశం కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ప్రజా ధనంతో అమెరికా పోతున్న సీఎం ఒక్క క్షణం ఈ పార్టీ మీటింగ్ కు పోవడం సరైంది కాదు. కానీ ఒక్క క్షణం అది సరైంది అను అనుకుంటే, మిగతా వారికి పర్మిషన్ ఇచ్చి రేవంత్ గారికే ఎందుకు నిరాకరించారు?. ఆల్రెడీ తుపాకీతో డక్కన్ సిమెంట్ (Deccan Cement) సంస్థ అధికారులను బెదిరించారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహన్ రెడ్డి ఇప్పటికే లండన్ చేరుకున్నారు. అసలు మీ తెలంగాణ సీయం ఆయన ‘మిత్ర బృందం’ ఇంత నిఘా పెట్టాల్సిన అవసరం ఏమిటి?. అసలు ఒక జూమ్ వీడియో కాల్‌తో దేశాలే ఒప్పందాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో, ప్రజా ధనం తో లండన్ అమెరికాలకు పెద్ద సంఖ్యలో పోవాల్సిన అవసరం ఉందా?` అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Diwali Day | నవంబర్ 8న దీపావళి దినోత్సవం.. తీర్మానానికి కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం
- ●Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు
- ●Reactor Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికులు మృతి
- ●బర్తరఫ్ చేస్తారా.. సైలెంట్ ఆపరేషన్ నడుపుతారా? కొండా వర్గంపై సీఎం రేవంత్ పొలిటికల్ స్కెచ్!
- ●Horoscope | ఆగస్టు 22 రాశి ఫలాలు.. ఈ రాశివారు విలువైన వస్తువుల కొనుగోలు చేస్తారు!
- ●Oxford | తెలంగాణలో విద్యా కార్యక్రమాలు చేపట్టండి.. ఆక్స్‌ఫర్డ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

Diwali Day | నవంబర్ 8న దీపావళి దినోత్సవం.. తీర్మానానికి కాలిఫోర్నియా అసెంబ్లీ ఆమోదం

Mid-Day Meal | బడి పిల్లల ప్రాణాలతో చెలగాటం.. మధ్యాహ్న భోజనంలో పురుగులు

Reactor Blast | ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు కార్మికులు మృతి

బర్తరఫ్ చేస్తారా.. సైలెంట్ ఆపరేషన్ నడుపుతారా? కొండా వర్గంపై సీఎం రేవంత్ పొలిటికల్ స్కెచ్!





