త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allam Narayana | తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలి: అల్లం నారాయణ

Allam Narayana | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలం, కెమెరాతో పాటు ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులను అధికారికంగా ఉద్యమకారులుగా గుర్తించి, వారికి తగిన గౌరవం, సంక్షేమ పథకాలు కల్పించాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రభుత్వాన్ని కోరారు.

P

Telangana | Published On Jul 21, 2026, 9.40 pm IST

Allam Narayana | తెలంగాణ ఉద్యమ జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలి: అల్లం నారాయణ
Advertisement

Allam Narayana | తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కలం, కెమెరాతో పాటు ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులను అధికారికంగా ఉద్యమకారులుగా గుర్తించి, వారికి తగిన గౌరవం, సంక్షేమ పథకాలు కల్పించాలని తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. అలాగే తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే మీడియా సంస్థలను ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరుల స్మారక కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీకి మంగళవారం టీజేఎఫ్ వినతిపత్రం సమర్పించింది.

ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, సమైక్యాంధ్ర పాలనలో ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి తెలంగాణ జర్నలిస్టులు ఉద్యమానికి అండగా నిలిచారని, ఎన్నో ఒత్తిళ్లు, నిర్బంధాలను ఎదుర్కొంటూ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లారని అన్నారు. వినతిపత్రంలో ఉద్యమ జర్నలిస్టులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు సహా సంక్షేమ పథకాలు అందించాలని, యువ జర్నలిస్టులకు మీడియా అకాడమీ ద్వారా నిరంతర శిక్షణ కల్పించాలని కోరారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ జర్నలిస్టులకు ప్రోత్సాహకాలు కల్పించి కొత్త మీడియా సంస్థల్లో అవకాశాలు కల్పించాలని సూచించారు. తెలంగాణ మీడియా సంస్థల బలోపేతానికి రూ.1,000 కోట్ల ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిటీని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్, టీజేఎఫ్ ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, ఏ రమణ కుమార్, ఆస్కాని మారుతీ సాగర్, పీ యోగనంద్, భాస్కర్, యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement