త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ

Harish Rao | తెలంగాణ విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ, ఈక్విటీ డైల్యూషన్‌ ప్రతిపాదనలను నిలిపివేయాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. టీజీ-ట్రాన్స్‌కో ప్రతిపాదిత ఐపీఓ, 26 శాతం వాటా తగ్గింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించేలా జోక్యం చేసుకోవాలని కోరారు.

P

Telangana | Published On Oct 2, 2026, 8.41 pm IST

Harish Rao | టీజీ-ట్రాన్స్‌కో ప్రైవేటీక‌ర‌ణ‌ను ఆపండి.. రాహుల్‌కు హరీశ్‌రావు లేఖ
Advertisement

Harish Rao | తెలంగాణ విద్యుత్‌ సంస్థల ప్రైవేటీకరణ, ఈక్విటీ డైల్యూషన్‌ ప్రతిపాదనలను నిలిపివేయాలని బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి లేఖ రాశారు. టీజీ-ట్రాన్స్‌కో ప్రతిపాదిత ఐపీఓ, 26 శాతం వాటా తగ్గింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించేలా జోక్యం చేసుకోవాలని కోరారు. టీజీ-ట్రాన్స్‌కోతో పాటు టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంల్లో ప్రైవేటీకరణ, ఈక్విటీ డైల్యూషన్‌కు ఎలాంటి చర్యలు తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రతిపాదనలు 2019 లోక్‌సభ ఎన్నికల కాంగ్రెస్‌ మేనిఫెస్టో, 2023 రాయ్‌పూర్‌ తీర్మానానికి ఎలా అనుగుణంగా ఉంటాయో స్పష్టం చేయాలని కోరారు.

దశాబ్దాలుగా ప్రజాధనంతో నిర్మించిన సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లతో టీజీ-ట్రాన్స్‌కో విద్యుత్‌ ప్రసార వ్యవస్థకు వెన్నెముకగా ఉందని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేట్‌ వాటాకు అవకాశం కల్పిస్తే.. టీజీ-జెన్‌కో, సింగరేణి, డిస్కంలపైనా ఇదే తరహా చర్యలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో వ్యూహాత్మక ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను కాంగ్రెస్‌ వ్యతిరేకిస్తూనే.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదనలు తీసుకురావడంపై రాహుల్‌గాంధీ స్పష్టత ఇవ్వాలన్నారు. టీజీ-ట్రాన్స్‌కో ఐపీఓను ఉపసంహరించడంతో పాటు కీలక ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా తగ్గించే చర్యలను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement