త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asian Games 2026 | పాక్‌పై విక్ట‌రీ.. ఆసియా క‌ప్‌లో భార‌త జ‌ట్టుకు గోల్డ్‌

Asian Games 2026 | ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత క్రికెట్‌ జట్టు మరో స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి పురుషుల క్రికెట్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఛేదనలో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌ స్వర్ణం.. పాకిస్థాన్‌ రజతం సాధించాయి. అంతకుముందు బంగ్లాదేశ్‌ను ఓడించిన శ్రీలంక కాంస్యం దక్కించుకుంది.

P

Sports | Published On Oct 3, 2026, 3.45 pm IST

Asian Games 2026 | పాక్‌పై విక్ట‌రీ.. ఆసియా క‌ప్‌లో భార‌త జ‌ట్టుకు గోల్డ్‌
Advertisement
  • వరుసగా రెండోసారి ఏషియన్‌ గేమ్స్‌లో క్రికెట్ స్వ‌ర్ణ‌ప‌త‌కం

Asian Games 2026 | ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భారత క్రికెట్‌ జట్టు మరో స్వర్ణ పతకాన్ని ఖాతాలో వేసుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి పురుషుల క్రికెట్‌లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. ఛేదనలో పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్‌ స్వర్ణం.. పాకిస్థాన్‌ రజతం సాధించాయి. అంతకుముందు బంగ్లాదేశ్‌ను ఓడించిన శ్రీలంక కాంస్యం దక్కించుకుంది.

అభిషేక్‌.. తిలక్‌ మెరుపులు

భారత్‌కు వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 28 పరుగులు జోడించిన తర్వాత వైభవ్‌ (15) ఔటయ్యాడు. అనంతరం సంజూ శాంసన్‌ 2 పరుగులకే వెనుదిరిగాడు. అభిషేక్‌, శ్రేయస్‌ అయ్యర్‌ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 24 బంతుల్లో 42 పరుగులు జోడించారు. అభిషేక్‌ 28 బంతుల్లో 61 పరుగులతో చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇది అతడికి 13వ టీ20 అంతర్జాతీయ అర్ధ శతకం. ఆ తర్వాత శ్రేయస్‌ (21), ఇషాన్‌ కిషన్‌ (20) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. తిలక్‌ వర్మ, శివమ్‌ దూబే మాత్రం పాక్‌ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఆరో వికెట్‌కు 30 బంతుల్లో 62 పరుగులు జోడించారు. దూబే 15 బంతుల్లో 27 పరుగులు చేయగా.. తిలక్‌ కేవలం 21 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. చివరికి 22 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతడి స్కోరులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్లో భారత్‌ 16 పరుగులు రాబట్టింది. పాకిస్థాన్‌పై టీ20ల్లో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. 2012లో నమోదు చేసిన 192 పరుగుల రికార్డును 14 ఏళ్ల తర్వాత భారత్‌ అధిగమించింది. పాక్‌ బౌలర్లలో అహ్మద్‌ దానియాల్‌, అరాఫత్‌ మిన్హాస్‌ రెండేసి వికెట్లు తీశారు.

39 ప‌రుగుల‌కే మూడు వికెట్ల‌..

212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ మాజ్‌ సదాఖత్‌ (23), ఉస్మాన్‌ ఖాన్‌ (3)లను పెవిలియన్‌కు పంపాడు. వాషింగ్టన్‌ సుందర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (10)ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత హసన్‌ నవాజ్‌, సైమ్‌ అయూబ్‌ కలిసి పాక్‌ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. నాలుగో వికెట్‌కు 48 బంతుల్లో 87 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని శివమ్‌ దూబే విడదీశాడు. సుందర్‌ క్యాచ్‌తో సైమ్‌ అయూబ్‌ (29) వెనుదిరిగాడు. అనంతరం అబ్దుల్‌ సమద్‌ 9 పరుగులకే ఔటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్‌ 160/4తో ఉంది. విజయానికి 18 బంతుల్లో 52 పరుగులు అవసరం. ఈ దశలో హసన్‌ నవాజ్‌ 80 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 18వ ఓవర్‌ వేసిన వాషింగ్టన్‌ సుందర్‌ కేవలం 8 పరుగులే ఇచ్చి అబ్దుల్‌ సమద్‌ను ఔట్‌ చేశాడు. 19వ ఓవర్‌లో బుమ్రా 11 పరుగులిచ్చాడు. దీంతో చివరి ఆరు బంతుల్లో పాక్‌కు 33 పరుగులు అవసరమయ్యాయి. శివమ్‌ దూబే వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతికి ఫోర్‌ వచ్చింది. ఆ తర్వాత వైడ్‌.. అనంతరం వరుసగా రెండు డాట్‌ బాల్స్‌తో భారత్‌ మ్యాచ్‌పై పట్టు బిగించింది. నాలుగో బంతికి నవాజ్‌ సిక్సర్‌ బాదాడు. ఐదో బంతికి రెండు పరుగులు తీశాడు. చివరి బంతికి నవాజ్‌ ఔటవడంతో పాక్‌ పోరాటం ముగిసింది. సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయిన నవాజ్‌ 51 బంతుల్లో 96 పరుగులు చేశాడు.

వరుసగా రెండో గోల్డ్‌

ఏషియన్‌ గేమ్స్‌లో పురుషుల క్రికెట్‌లో భారత్‌కు ఇది వరుసగా రెండో స్వర్ణం. 2023 హ్యాంగ్‌జౌ గేమ్స్‌లో రుతురాజ్‌ గైక్వాడ్‌ నాయకత్వంలో భారత్‌ గోల్డ్‌ సాధించింది. ఈసారి కూడా పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణాన్ని నిలబెట్టుకుంది. మహిళల క్రికెట్‌లోనూ భారత్‌ 2023లో గోల్డ్‌ సాధించిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement