KTR | జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు.. రెండురోజులు దశాబ్ది ఉత్సవాలు : కేటీఆర్
KTR | తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులు, శ్రేణులకు సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు.
KTR | తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అక్టోబర్ 10, 11 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా దశాబ్ది కార్యక్రమాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నాయకులు, శ్రేణులకు సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. తెలంగాణ సాధనలో అధికార వికేంద్రీకరణ కీలకమైన ఆశయమని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజల ముంగిటికే పరిపాలనను తీసుకురావాలన్న లక్ష్యంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా సంస్కరణలు చేపట్టిందని గుర్తుచేశారు. గతంలో ఉన్న 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేయడం ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేశామని తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో దశాబ్దాలుగా ఉన్న ప్రజల ఆకాంక్షలు నెరవేరాయని కేటీఆర్ అన్నారు. గతంలో జిల్లా కేంద్రాలకు వెళ్లేందుకు 100–150 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉండేదని, కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ ఇబ్బందులు తొలగిపోయాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక వసతులు, వైద్య, విద్యా సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు.
ఉద్యమకారులకు సన్మానం
జిల్లాల కోసం ఉద్యమించిన జేఏసీలు, ఉద్యమకారులను దశాబ్ది కార్యక్రమాల్లో సన్మానించాలని కేటీఆర్ సూచించారు. బార్ అసోసియేషన్లు, జర్నలిస్టులు, ఉద్యోగులు, పెన్షనర్లు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, కవులు, కళాకారులు, సామాజిక కార్యకర్తలను కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని చెప్పారు. ప్రతి జిల్లా గత పదేళ్లలో సాధించిన అభివృద్ధిని ప్రజల ముందుంచాలని, ‘అప్పుడు–ఇప్పుడు’ విధానంలో జిల్లాల్లో వచ్చిన మార్పులను వివరించాలని సూచించారు. ఆయా జిల్లాల ప్రత్యేక విజయగాథలను ప్రజలకు తెలియజేయడంతోపాటు స్థానిక మీడియా, సోషల్ మీడియా వేదికల ద్వారా కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల ఏర్పాటు కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ కాదని, ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతులను ప్రజలకు చేరువ చేసే ప్రక్రియలో భాగమని కేటీఆర్ అన్నారు. ‘మనం అధికారంలో ఉన్నా లేకపోయినా రాష్ట్రం శాశ్వతం.. జిల్లాలు శాశ్వతం. తెలంగాణలో అధికార వికేంద్రీకరణ, పరిపాలనా సంస్కరణల ద్వారా జరిగిన మార్పులను ప్రజలకు గుర్తు చేయాల్సిన బాధ్యత మనపై ఉంది’ అని పార్టీ శ్రేణులకు సూచించారు. అక్టోబర్ 10, 11 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాలను కేవలం పార్టీ కార్యక్రమాలుగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో జిల్లా దశాబ్ది వేడుకలుగా నిర్వహించాలని కేటీఆర్ స్పష్టం చేశారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్డౌన్!





