త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jantar Mantar Protest | ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు.. కేంద్రంపై సీజేపీ విమ‌ర్శ‌లు..

Jantar Mantar Protest | దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని, ఢిల్లీని కోటలా మార్చేశారని జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్‌ దాస్‌ ఆరోపించారు. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు ముందు భద్రతా ఏర్పాట్లపై ఆయనతో పాటు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

P

National | Published On Oct 9, 2026, 7.40 pm IST

Jantar Mantar Protest | ఢిల్లీలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు.. కేంద్రంపై సీజేపీ విమ‌ర్శ‌లు..
Advertisement

Jantar Mantar Protest | దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయని, ఢిల్లీని కోటలా మార్చేశారని జనతా పార్టీ (సీజేపీ) నేత సౌరవ్‌ దాస్‌ ఆరోపించారు. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనకు ముందు భద్రతా ఏర్పాట్లపై ఆయనతో పాటు పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, రైలు సేవల నిలిపివేత, రహదారుల దిగ్బంధంపై అభ్యంతరం తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపే విద్యార్థులు, యువతను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు.

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మాట్లాడుతూ మెట్రో, రైలు సేవలను ఎందుకు నిలిపివేస్తున్నారని, రహదారులను ఎందుకు మూసేస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం శాంతియుతంగా నిరసన తెలిపే యువతను దేశ శత్రువుల్లా చూడటం సరికాదన్నారు. యువత అరెస్టులతో దేశ సమస్యలన్నీ పరిష్కారమవుతాయంటే తమను అరెస్టు చేసుకోవచ్చంటూ ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.

కాశ్మీర్‌, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల నుంచి భద్రతా బలగాలను ఢిల్లీకి తరలిస్తున్నారని దీపక్‌ ఆరోపించారు. యువత, ముఖ్యంగా జెన్‌ జీ నిరసనలంటే ప్రభుత్వానికి భయమని విమర్శించారు. అయితే, బలగాల తరలింపుపై అధికారిక వివరాలు వెల్లడికాలేదు. మరోవైపు, మహారాష్ట్రలో సీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని పార్టీ అధికార ప్రతినిధి ఆశుతోష్‌ రంకా ఆరోపించారు. కొందరిని రైలు ఎక్కిన తర్వాత దించేశారని తెలిపారు. యువత నిరసనలకు ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.

Advertisement
Advertisement